సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో హోం మంత్రి సుచరిత విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతమ్ నవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజీత్‌లు హాజరయ్యారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లోని మొత్తం 2723 పోస్టులకు గాను 2623 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 500 మంది మహిళలున్నారు. ఆయా సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో వంద పోస్టులు మిగిలిపోయాయని పోలీసు శాఖ తెలిపింది.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను http://slprb.ap.gov.in/ వెబ్‌సైట్లో ఉంచినట్లు పోలీసు శాఖ తెలిపింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.com కు ఈ నెల 16వ తేదీలోపు అభ్యంతరాలు పంపవచ్చని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తామని పోలీసు శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment