final results
-
'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే..
MAA Elections 2021 Winners List : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. నిన్న జరిగిన పోలింగ్‌లో మా అధ్యక్షుడు మినహా మిగతా ఈసీ మెంబర్ల తుది ఫలితాలు వెల్లడి కాలేదు. తాజాగా 18మంది ఈసీ సభ్యుల తుది ఫలితాలను ఎన్నికల అధికారి వెల్లడించారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన విజేతలు వీళ్లే.. ►మా అధ్యక్షుడు - మంచు విష్ణు (383 ఓట్లు) ప్రకాశ్‌రాజ్ (274 ఓట్లు)109 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు. ► జనరల్ సెక్రటరీ - రఘుబాబు (341 ఓట్లు) ►ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - శ్రీకాంత్ (375 ఓట్లు) ► జాయింట్ సెక్రటరీలు - ఉత్తేజ్ (333 ఓట్లు) , గౌతంరాజు (322 ఓట్లు) ►వైస్ ప్రెసిడెంట్స్ - మాదాల రవి (376 ఓట్లు), బెనర్జీ (298 ఓట్లు) ► ట్రెజరర్ - శివబాలాజీ (360 ఓట్లు) గెలుపొందిన ఈసీ మెంబర్లు వీళ్లు.. 18 మంది ఈసీ సభ్యుల కోసం జరిగిన పోటీలో 10 మంది మంచు విష్ణు ప్యానల్‌కు చెందినవారు, ఎనిమిది మంది ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చెందినవారు గెలుపొందారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్లో గెలుపొందిన ఈసీ మెంబర్స్ ♦ శివారెడ్డి (362 ఓట్లు) ♦ బ్రహ్మాజీ (334 ఓట్లు) ♦ ప్రభాకర్ (319 ఓట్లు) ♦ తనీష్ (306 ఓట్లు) ♦ సురేశ్ కొండేటి (294 ఓట్లు) ♦ కౌశిక్ (269 ఓట్లు) ♦ సుడిగాలి సుధీర్ (279 ఓట్లు) ♦ సమీర్ (282 ఓట్లు) మంచు విష్ణు ప్యానల్లో గెలుపొందిన ఈసీ మెంబర్స్ ♦ గీతా సింగ్ (342 ఓట్లు) ♦ అశోక్ కుమార్ (336 ఓట్లు) ♦ శ్రీలక్ష్మీ (330 ఓట్లు) ♦ సి.మాణిక్ (326 ఓట్లు) ♦ శ్రీనివాసులు (296 ఓట్లు) ♦ హరనాథ్‌బాబు (296 ఓట్లు) ♦ ఎన్.శివన్నారాయణ (290 ఓట్లు) ♦ సంపూర్ణేశ్‌బాబు (285 ఓట్లు) ♦ శశాంక్ (284 ఓట్లు) ♦ బొప్పన విష్ణు (271 ఓట్లు) -
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో హోం మంత్రి సుచరిత విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతమ్ నవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజీత్‌లు హాజరయ్యారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లోని మొత్తం 2723 పోస్టులకు గాను 2623 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 500 మంది మహిళలున్నారు. ఆయా సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో వంద పోస్టులు మిగిలిపోయాయని పోలీసు శాఖ తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను http://slprb.ap.gov.in/ వెబ్సైట్లో ఉంచినట్లు పోలీసు శాఖ తెలిపింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.com కు ఈ నెల 16వ తేదీలోపు అభ్యంతరాలు పంపవచ్చని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తామని పోలీసు శాఖ వెల్లడించింది. -
24 గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడుతున్న కొద్దీ అందరిలో పొలిటికల్ ఫీవర్ తారస్థాయికి చేరుకుంది. గత నెల 11వ తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్‌కు సుదీర్ఘ సమయం ఉండడంతో ఒకరిద్దరు మినహా మిగతా అభ్యర్థులు అందరూ విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంగళవారమే జిల్లాకు చేరుకున్నారు. కౌంటింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుండడంతో ప్రధాన పార్టీల రాజకీయ నేతల సందడి పెరిగింది. హోటళ్లు అన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. గెలుపుపై అభ్యర్థుల ధీమా సార్వత్రిక ఎన్నికల్లో విజేతలు ఎవరు.. పరాజితులు ఎవరు.. ఎవరెవరికి ఎంత మెజారిటీ వస్తుంది.. బాగా మెజారిటీ వచ్చే మండలాలు.. మెజారిటీ తగ్గే మండలాలు.. యువత, మహిళలు, రైతులు ఎవరికి పట్టం కట్టారు.. ఇలాంటి అనేక ప్రశ్నలకు 23వ తేదీ ఉదయం 11 గంటల కల్లా పూర్తి సృష్టత రానుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం స్వీయ అంచనాలు వేసుకొని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 19న చివరి దశ పోలింగ్ ప్రకియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో పార్టీ క్యాడర్లో విశ్వాసం రెట్టించినట్లయింది. నేతలు సైతం ఉత్సాహంగా ఉన్నారు. చకచకా ఏర్పాట్లు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల ప్రాంగణంలో, అలాగే తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కలెక్టర్ రెండు రోజులుగా కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించి, రెండు స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. ఇక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఒక్కొక్క రాజకీయపార్టీకి 14 చొప్పున కౌంటింగ్ ఏజెంట్ పాస్‌లను జారీ చేస్తున్నారు. దాదాపు ఈప్రక్రియ కూడా 90 శాతం పూర్తయింది. బరిలో 132 మంది అభ్యర్థులు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల నుంచి ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు పోటీ చేశారు. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 107 మంది పోటీ చేశారు. ఇక నెల్లూరు పార్లమెంట్ నుంచి ప్రధాన రాజకీయపార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీతోపాటు వామపక్షాలు, జనసేన ఉమ్మడి అభ్యర్థి, ఇండిపెండెంట్లు మొత్తం కలుపుకొని 13 మంది బరిలో నిలిచారు. అలాగే తిరుపతి పార్లమెంట్ నుంచి 12 మంది బరిలో నిలిచారు. గత నెల 11న జరిగిన సార్వత్రిక పోలింగ్‌లో 23.92 లక్షల మంది ఓటర్లకు గానూ 18.34 లక్షల మంది తమ ఓటు హక్కును జిల్లాలో వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 76.67 శాతం పోలింగ్ నమోదయింది. సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు కలుపుకొని మరి కొంత శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ పర్యాయం వీవీ ప్యాట్ లెక్కింపు కారణంగా ఫలితాల అధికారిక ప్రకటన రాత్రి 9 గంటలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా సన్నద్ధమయ్యాయి. హోటళ్లు హౌస్‌ఫుల్ విదేశీ పర్యటనలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు దాదాపు అందరూ జిల్లాకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి అభ్యర్థులు అందరూ నెల్లూరు నగరంలోనే మకాం వేయనున్నారు. మరోవైపు 23వ తేదీన జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ నెల్లూరు నగరంలోనూ, నగర శివారుల్లోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని నెల్లూరు సిటీ, రూరల్ మినహా మిగిలిన నియోజకవర్గాలకు చెందిన నేతలు, వారి అనుచరగణం ఇప్పటికే నగరంలో మకాం వేశారు. దీంతో నగరంలో హోటళ్లు నిండిపోయాయి. సర్వీసు అపార్ట్మెంట్లు, గౌస్ట్హౌస్లు కూడా పూర్తి బిజీగా మారిపోయాయి. -
సాక్షి జర్నలిజం ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు
► 24న కోర్సు ప్రారంభోత్సవం ► మొత్తం 113 మంది ఎంపిక సాక్షి, హైదరాబాద్: ఏడాది పీజీ డిప్లమా కోర్సు కోసం సాక్షి జర్నలిజం స్కూల్ నిర్వహించిన ప్రవేశ పరీక్ష, బృందచర్చ, మౌఖిక పరీక్షల అనంతరం తుది ఫలితాలను సోమవారం విడుదల చేశారు. సాక్షి ఎడ్యుకేషన్.కామ్; సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజమ్.కామ్‌లలో ఫలితాలను చూసుకోవచ్చని ప్రిన్సిపాల్ దిలీప్‌రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ నంబరు ఆధారంగా అక్కడే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపికైనవారు ఈ నెల 24 న(సోమవారం) సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ఉదయం 9.30 గంటలకు జరిగే కోర్సు ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ఎంపికైన వారి హాల్ టికెట్ నంబర్లు 201007 201009 211014 211047 211056 221020 221042 221049 221050 221061 221063 221066 221068 221081 221083 221088 231009 231028 241002 241008 241028 241029 241056 251005 251008 261002 261006 271005 271006 271008 271017 281005 281014 281018 281022 291007 291009 301006 301033 311026 331004 331007 331009 331013 331016 331020 331021 331024 331025 331056 331058 331061 331070 331075 331080 331081 331093 331096 331099 331111 331113 331119 331120 331128 331133 331135 331145 331177 331212 331225 331244 331270 331272 331275 331277 331284 331285 331289 331329 331368 331406 331418 331419 331422 331438 331441 331450 331476 411014 411015 411033 411035 411038 411050 411051 411052 411087 411093 411097 421055 441008 441018 441073 441076 441095 451003 451020 451024 461055 461062 461092 461110 461131 -
మూడు రౌండ్లు.. మూడు గంటలు
ఇదీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ తీరు ♦ మొత్తం డివిజన్లు 50 ♦ పోలైన ఓట్లు 1,79,827 ♦ పోలింగ్ కేంద్రాలు 265 ♦ బరిలో ఉన్న అభ్యర్థులు 291 ♦ లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు 20 ♦ ప్రక్రియలో పాల్గొనే అధికారులు 100మంది ఖమ్మం: కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 11గంటలలోపు తుది ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నా రు. మొత్తం 3 రౌండ్లుగా విభజించి.. ఒక్కో రౌండ్‌కు గంట చొప్పున సమయం కేటాయించి.. ఫలితాలు మూడు గంటల వ్యవధిలో ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల బరిలో నిలబడి పోటాపోటీగా ప్రచా రం నిర్వహించిన అభ్యర్థుల్లో కౌంటింగ్ ప్రక్రి య ప్రారంభమవుతుండటంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. తొలుత అన్ని రాజకీయ పార్టీ ల నాయకుల సమక్షంలో పత్తి మార్కెట్లోని స్ట్రాంగ్‌రూమ్ సీల్ తీసి ఈవీఎంలను బయటకు తీసుకొస్తారు. ఉదయం 8గంటలకు ఈవీఎంలు ఉంచిన టేబుళ్ల వద్దకు అభ్యర్థులు లేదా వారి తరపున ఒక ఏజెంట్‌ను గాని పిలిచి పోస్టల్ బ్యాలెట్ లెక్కించి పార్టీల వారీగా నమోదు చేసుకుంటారు. అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేసి పోలింగ్స్టేషన్ల వారీగా రాజకీయ పార్టీలకు పడిన ఓట్లను నమోదు చేసుకుంటారు. అన్ని పోలింగ్స్టేషన్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. పత్తి మార్కెట్లో... ♦ కార్పొరేషన్‌లోని 50 డివిజన్లను 3 రౌం డ్లుగా విభజించి.. 3 గంటల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. ఖమ్మం పత్తి మార్కెట్లో లెక్కింపు కోసం 20 కౌంట ర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్లో నలుగురు జిల్లాస్థాయి అధికారులను నియమించారు. ♦ ఒకటి నుంచి 20వ డివిజన్ వరకు తొలి విడతగా తీసుకుని ఒక్కో కౌంటర్ వద్ద డివిజన్లోని పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను ఉంచుతారు. ఇలా 20 కౌంటర్లలో 20 డివిజన్లకు సంబంధించిన ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ♦ 2వ రౌండ్‌గా 21వ డివిజన్ నుంచి 40వ డివిజన్ వరకు ఈవీఎంలను తీసుకొచ్చి లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ♦ 3వ రౌండ్లో 41 నుంచి 50 డివిజన్ వరకు ఈవీఎంలను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఉదయం 8గంటల నుంచి ప్రారంభమై 11గంటల వరకు పూర్తి చేస్తారు. అర్థగంటలోనే ఆ ఆరు డివిజన్ల ఫలితాలు.. ♦ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన అర్థగంటలోనే తక్కువ పోలింగ్స్టేషన్లు ఉన్న డివిజన్ల ఫలితాలు వెల్లడించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వీటిలో నాలుగే పోలింగ్ కేంద్రాలున్న 1, 5, 15, 16, 18, 20 డివిజన్ల ఫలితాలు త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. ♦ అభ్యర్థి లేదా.. అతడి తరఫు ఏజెంట్‌కే అనుమతి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు అభ్యర్థి లేదా అతడి తరఫున ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తామని అంటున్నారు. -
సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తుది ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాల్లో పీజీ డిప్లొమా కోర్సు, తదనంతర ఉద్యోగాల కోసం నిర్వహించిన బృంద చర్చలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులైన 110 మంది అభ్యర్థుల జాబితాను సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రకటించిం ది. డిప్లొమా కోర్సు ప్రారంభ తేదీ అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేస్తారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ; సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షిఎడ్యుకేషన్ వెబ్సైట్లలోనూ చూసుకోవచ్చు. కోర్సు మొదలయ్యే తేదీ వెల్లడించిన నాటి నుంచి నాలుగు రోజుల్లో స్కూల్లో అడ్మిషన్ పొందేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తెలిపింది. ఎంపికైన వారి హాల్‌టికెట్ నంబర్లు... 111137, 111167, 111182, 111252, 111404, 111405, 111413, 111422, 111425, 121069, 121150, 121152, 131037, 131039, 131052, 131141, 131225, 131246, 131247, 131261, 131267, 131273, 131274, 131295, 131350, 131400, 131437, 131443, 131475, 131478, 131499, 131528, 131540, 131590, 131625, 131634, 131805, 131875, 131919, 132011, 132048, 132127, 132129, 132169, 132209, 132322, 132340, 132352, 132404, 132464, 132556, 132655, 132686, 132690, 132692, 132768, 132957, 132997, 133129, 133179, 133239, 133250, 133284, 141077, 141100, 141113, 161111, 161196, 161295, 171012, 171129, 201007, 201021, 201024, 201026, 201026, 201111, 201140, 201246, 211006, 221020, 221030, 221053, 221056, 231010, 231017, 231034, 231049, 231168, 231174, 241022, 241085, 251003, 261034, 261067, 261083, 271043, 271141, 271222, 281195, 281210, 281350, 291196, 301006, 311019, 311060, 311070, 311145, 311248, 311323.