సాక్షి, తాడేపల్లి: కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులను సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి సన్మానించారు. అలాగే కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తాడేపల్లి నివాసంలో తనను మర్యాద పూర్వకంగా కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి జ్ఞాపికను బహూకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
కాగా, తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నేటి మధ్యాహ్నం కనక దుర్గమ్మను కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణికి నూతన వస్త్రాలు బహూకరిస్తున్న సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment