![Perni Nani Comments On Chandra Babu And Nara Lokesh - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/12/perni-nani.jpg.webp?itok=drQoaPDu)
సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు నాలుకలకు నరాలు లేవని, తిరుపతి ప్రచారంలో వారు అసభ్యపదజాలం వాడుతున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు.. లోకేష్‌కు నాలుగు మంచిమాటలు కూడా నేర్పించలేకపోయారని అన్నారు. సోమవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బీజేపీ, టీడీపీలకు అజెండా లేదు. బీజేపీ, టీడీపీ విష ప్రచారంపైనే ఆధారపడ్డాయి.
ఇచ్చిన ప్రతి హామీని మేం నెరవేర్చాం. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రచారానికి రావడం లేదని సీఎం జగన్ చెప్పారు. సమాజహితం కోసమే తిరుపతి ప్రచార సభను సీఎం రద్దు చేసుకున్నారు. కరోనాకు భయపడి హైదరాబాద్ ఇంట్లో దాక్కుంది చంద్రబాబే. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేని స్థితిలో బీజేపీ నేతలున్నార’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment