
సాక్షి, తాడేపల్లి: ఉద్యమాల పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలను చంద్రబాబు పట్టించుకోలేదని... నారాయణ కమిటీ పేరుతో తాను చేయాలనుకున్నది చేశారని మండిపడ్డారు. గురువారమిక్కడ ఆయన వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మట్లాడారు. ఈ సందర్భంగా అమరావతి ప్రకటనకు ముందే టీడీపీ నేతలు అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. అదే విధంగా అసైన్డు భూముల రైతులకు చంద్రబాబు అండ్ కో అన్యాయం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేం అండగా ఉంటాం..
రాజధాని రైతులను మోసం చేయాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఎక్కడ కూడా అమరావతి భూములను లాక్కోవడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు రాజధాని రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులకు తాము అండగా ఉంటామని.. అదే విధంగా రాయలసీమ ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకాశ్‌రెడ్డి భరోసానిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment