'వైఎస్‌ జగన్‌' ను కలిసిన చిరంజీవి దంపతులు | Chiranjeevi Family Meets YS Jagan Family At Tadepalli- Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు

Published Mon, Oct 14 2019 2:07 PM | Last Updated on Mon, Oct 14 2019 3:41 PM

Megastar Chiranjeevi Meets CM Jagan In Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి... భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి.  ఈనెల 5న తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను చిరం‍జీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్‌ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఈనెల 2న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో భారీ వసూళ్లు సాధించింది. సినిమా హిట్‌ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement