వై ఎస్ జగన్ : ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష | YS Jagan review meeting on the distribution of houses - Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్‌ సమీక్ష

Published Thu, Dec 26 2019 11:56 AM | Last Updated on Thu, Dec 26 2019 3:20 PM

CM YS Jagan Review Meeting Over House Site Distribution To Beneficiaries - Sakshi

సాక్షి, తాడేపల్లి: అర్హులైన పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్ణీత సమయంలో ఇళ్ల స్థలాల పంపిణీకై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తున్నారు.


కాగా ఇల్లులేని, అర్హులైన పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ఇళ్లు కట్టిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చిన విషయం విదితమే. అదే విధంగా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు స్థలాలు ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా వీటిని మహిళల పేరున రిజిస్ట్రేషన్‌ చేస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ సమీక్ష
తాడేపల్లి: మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీసుకువచ్చిన దిశ చట్టం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మేరకు.. హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌, పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కాగా దిశ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారన్న విషయం తెలిసిందే.(ప్రతిష్టాత్మక ‘దిశ’ యాక్ట్‌లోని ముఖ్యాంశాలివే..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement