సాక్షి, తాడేపల్లి : విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అప్పలరాజు తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. వలసలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉన్న బీసీలను అమరావతిలో భాగస్వామ్యం చేయలేదని, చంద్రబాబు పాలనలో ఆ ప్రాంతం నిర్లక్షానికి గురైందని విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాజధానిని అభివృద్ధి చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఉండాలన్న ప్రతిపాదన, అన్ని వర్గాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తీసుకున్నదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకుంటారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment