ఏ రాష్ట్రం కూడా మెడికల్ సీట్లు అస్సలు వదులుకోదు
కానీ ఆ పని చేసిన ఏకైక చెత్త ప్రభుత్వ చంద్రబాబుది
ఏ ప్రభుత్వమూ ఇంత పనికిమాలిన నిర్ణయం తీసుకోదు
మెడికల్ సీట్లపై మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు ఆశ్చర్యకరం
ప్రభుత్వ తీరుపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టీకరణ
శ్రీకాకుళం, సాక్షి: వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. మెడికల్ సీట్లు వదులుకోవడం అత్యంత హేయనీయమని వ్యాఖ్యానించారు. . పలాసలో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ..
‘‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ మాటలు బాధాకరం. మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే వద్దు అని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు..
.. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వద్దంటుందా?. కానీ, చంద్రబాబు ప్రభుత్వం సీట్లు వద్దు అని లెటర్ రాసింది. మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే.. తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తమకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి మొట్టమొదటి సారి పరిస్థితి ఏర్పడింది.
.. పద్నాలుగేళ్లు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా స్థాపించలేదు. అయినా కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోండి అని ఎన్ఎంసీ నిధులు ఇస్తుంటే.... మాకు వద్దు అన్న ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కింది. రాష్ట్రంలోని వైద్య విద్యను ఎంచుకోవాలనుకున్న అనేక లక్షల మంది భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ఈ చర్యలను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు గమనించాలి అని సీదిరి అప్పలరాజు కోరారు.
ఇదీ చదవండి: పవన్ అయినా స్పందించడేం?
Comments
Please login to add a commentAdd a comment