కొత్తవలస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన ఉరిటి అప్పలరాజు(24) అనే యువకుడు అనారోగ్యంతో నొప్పులు తాళలేక ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కొత్తవలస పోలీసులు మంగళవారం తెలిపారు.
కొత్తవలస రూరల్ (శృంగవరపుకోట): కొత్తవలస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన ఉరిటి అప్పలరాజు(24) అనే యువకుడు అనారోగ్యంతో నొప్పులు తాళలేక ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కొత్తవలస పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...అప్పలరాజు విశాఖపట్నంలో రైల్వే కలాసీగా పనిచేస్తున్నాడు. 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే ఇంటికి తీసుకువచ్చారని తెలిపారు. మంగళవారం ఇంట్లోఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అప్పలరాజు అన్నయ్య చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేతికందొచ్చిన కొడుకు తమకు దూరం కావటంతో తలిదండ్రులు అప్పారావు, సింహాచలం కన్నీరుమున్నీరయ్యారు.