స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు సేవలు చాలని, ఇక ఆయన రెస్టు తీసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. శాసనసభలో అప్పలరాజు మాట్లాడుతూ.. ‘ఈ సభలో మేం జూనియర్స్. చాలా నేర్చుకోవాల్సి ఉంది. స్పీకర్ పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారు. స్పీకర్ గారిది మా ఊరు. వెనుకబడిన వర్గాలకు స్పీకర్ పదవి ఇవ్వడంతో చైర్‌లో కూర్చోబెట్టేందుకు కూడా చంద్రబాబు రాలేదు.