
పలాస వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు (ఫైల్ ఫోటో)
సాక్షి, శ్రీకాకుళం : డబ్బులు లేక ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు తెలిపారు. కేన్సర్‌తో బాధపడుతున్న పలాస టీడీపీ నేత పీరుకట్ల విశ్వేశ్వరరావు కుమార్తె సాయి శిరీషకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన పది లక్షల రూపాయలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రాజన్న రాజ్యంలో రాజకీయాలకు అతీతంగా సహాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment