
సాక్షి,శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించి ఏపీ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మానవత్వాన్ని చాటుకున్నారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మలి మండలంలో వివాహ వేడుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో నౌపడా గ్రామం వద్ద వాహనం బోల్తా పడడాన్ని మంత్రి గమనించారు.
వెంటనే కారు దిగి క్షతగాత్రుడిని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న వ్యక్తిని తన కాన్వాయ్ లోని ప్రోటోకాల్ వాహనంలో టెక్కలి ఏరియా ఆస్పత్రికి మంత్రి సీదిరి అప్పలరాజు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment