
పోలీసుల వేధింపులతోనే జవాను ఆత్మహత్య: భార్య
పోలీసులు వేధించడం వల్లే తన భర్త అప్పలరాజు మరణించినట్లు ఆయన భార్య అనసూయ ఆరోపించారు. మెహిదీపట్నంలోని ఆర్మీ ప్రాంతంలో ముస్తఫా అనే బాలుడి అనుమానాస్పద స్థితి కేసులో పోలీసులు విచారించారన్న మనస్తాపంతో అప్పలరాజు సర్వీసు రైఫిల్తో కాల్చుకుని మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన భార్య అనసూయ స్పందించారు.
తన భర్త దేశసేవ కోసమే ఆర్మీలో చేరారని, ఆయన మరణంతో ఇద్దరు పిల్లలు, తాను అనాథలుగా మారామని ఆమె వాపోయారు. తన భర్త మరణానికి కారణమైన పోలీసులపై కేసు నమోదు చేయాలని అప్పలరాజు భార్య అనసూయ డిమాండ్ చేశారు.