Army jawan suicide
-
ప్రియుడితో కలిసి భార్య వేధింపులు.. తట్టుకోలేక ఆర్మీ జవాన్!
సాక్షి, మంచిర్యాల: మనస్తాపంతో ఆర్మీజవాన్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం భగత్‌నగర్‌కు చెందిన మార్త అశోక్–పుష్ప దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్ (32)కు హాజీపూర్ మండలం ర్యాలిగడ్‌పూర్‌కు చెందిన బొద్దు రజితతో 2021జూన్ 24న వివాహమైంది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్‌కుమార్ ఉద్యోగరీత్యా ఇటీవల అమృత్సర్ వెళ్లాడు. ఈక్రమంలో ర్యాలిగడ్‌పూర్‌కు చెందిన బొప్ప రాకేష్‌తో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఇంటికి వచ్చిన భర్తకు విషయం తెలియడంతో పలుమార్లు పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయతీలో రజితను మందలించారు. అయినా ఆమెలో మార్పురాకపోగా రజిత తల్లి భాగ్య, ప్రియుడు రాకేశ్ కలిసి శ్రావణ్‌ను మానసికంగా వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. అతని మృతికి భార్య రజిత, భాగ్య, రాకేష్ కారణమని మృతుని తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: Hyderabad: నిప్పంటించుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య -
ఆర్మీ జవాన్ ఆత్మహత్య.. కశ్మీర్ లో కలకలం
- సరిహద్దులో డ్యూటీ చేస్తూ లాన్స్ నాయక్ విశాల్ బలవన్మరణం - కశ్మీర్ లోని రాజౌరీలో ఘటన జమ్ము: భారత్-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలోని రాజౌరీ సెక్టార్ లో విధులు నిర్వర్తిస్తోన్న ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.లాన్స్ నాయక్ విశాల్ లోహర్ మంగళవారం సాయంత్రం డ్యూటీలో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్ తో తలకు గురిపెట్టి కాల్చుకున్నాడని, ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మృతుడు విశాల్ స్వరాష్ట్రం కర్ణాటక. ప్రస్తుతం అతను 54వ రాష్ట్రీయ రైఫిల్స్ లో పనిచేస్తున్నాడు. వివిధ కారణాలతో ఆర్మీ, ఇతర భద్రతా బలగాల్లో పనిచేస్తోన్న జవాన్లు తరచూ ఆత్మహత్యలకు పాల్పడుతుండటం రక్షణ వర్గాలను ఆందోళనపరుస్తున్నాయి. -
ఆర్మీ జవాన్ ఆత్మహత్య
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్వోసీలో ఘటన ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మంద రాజశేఖర్(21) జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్వోసీలో ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో ఉండగానే ఆయన ఎస్ఎల్ఆర్ తుపాకీతో కుడి కణతపై కాల్చుకొని చనిపోయాడు. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా ఇక్కడికి సమాచారం అందించింది. సుర్జాపూర్‌కు చెందిన మంద శివయ్య పెద్దకొడుకు అయిన రాజశేఖర్ ఏడాదిన్నర క్రితం ఆర్మీ జవానుగా ఎంపికై మహారాష్ట్రలోని పుణెలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. పాకిస్తాన్–ఇండియా బోర్డర్లో గల జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్వోసీలో సెంట్రీగార్డుగా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం విధుల్లోకి వెళ్లాడు. రాజశేఖర్‌తో పాటు విధులు నిర్వర్తిస్తున్న మరో ఆర్మీ జవాన్ భోజనానికి వెళ్లి వచ్చేలోగా ఎస్ఎల్ఆర్ తుపాకీతో కాల్చుకున్నట్లు ఖానాపూర్ సీఐ అంగోతు పవార్‌నరేశ్ కుమార్ తెలిపారు. కాగా, కుప్వార ఎల్వోసీ నుంచి అతని మృతదేహాన్ని అతి కష్టంపై మీది నుంచి కిందకు మంగళవారం తెచ్చారు. రాజశేఖర్ మృతదేహానికి శ్రీనగర్‌లో పోస్టుమార్టం చేయించిన అనంతరం విమానంలో నాగ్‌పూర్‌కు, అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకొస్తారు. అయితే, తట్టుకోలేని వాతావరణ పరిస్థితులతో పాటు.. సకాలంలో సెలవు దొరకకపోవడంతోనే రాజశేఖర్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని భావిస్తున్నారు. -
పోలీసుల వేధింపులతోనే జవాను ఆత్మహత్య: భార్య
-
పోలీసుల వేధింపులతోనే జవాను ఆత్మహత్య: భార్య
పోలీసులు వేధించడం వల్లే తన భర్త అప్పలరాజు మరణించినట్లు ఆయన భార్య అనసూయ ఆరోపించారు. మెహిదీపట్నంలోని ఆర్మీ ప్రాంతంలో ముస్తఫా అనే బాలుడి అనుమానాస్పద స్థితి కేసులో పోలీసులు విచారించారన్న మనస్తాపంతో అప్పలరాజు సర్వీసు రైఫిల్‌తో కాల్చుకుని మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన భార్య అనసూయ స్పందించారు. తన భర్త దేశసేవ కోసమే ఆర్మీలో చేరారని, ఆయన మరణంతో ఇద్దరు పిల్లలు, తాను అనాథలుగా మారామని ఆమె వాపోయారు. తన భర్త మరణానికి కారణమైన పోలీసులపై కేసు నమోదు చేయాలని అప్పలరాజు భార్య అనసూయ డిమాండ్ చేశారు.