సంతబొమ్మాళి : పొట్ట కూటికి సౌది అరేబియా వెళ్లిన యువకుడు విధి నిర్వహణలో ఉండగా మృతి చెందిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళితే... మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన మోడి కామరాజు, కేశవమ్మ ప్రథమ పుత్రుడు మోడి మహేష్(25) అనే యువకుడు ఆరు నెలల క్రితం సౌది అరేబియాలో క్రేన్ ఆపరేటర్‌గా పని చేసేందుకు వెళ్లాడు. ఆదివారం(గత నెల 30న) డ్యూటీలో ఉండగా పక్కనే ఉన్న సిమెంట్ గోడకూలి మీద పడింది. సిమెంట్ ఇటుకలు తల, కాలుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మరణవార్త మంగళవారం తెలియడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిం చారు. మృతి వార్తను మం త్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని, మరికొద్ది రోజుల్లో మహేష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మోడి రామచంద్రరావు తెలిపారు. మృతుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఎంపీపీ కర్రి కృష్ణవేణి, మండల ప్రత్యేక ఆహ్వానితుడు కర్రి విష్ణుమూర్తి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
సౌదీలో జిల్లా యువకుడి మృతి
Published Wed, Dec 3 2014 2:08 AM | Last Updated on Mon, Aug 20 2018 7:33 PM
Advertisement
Advertisement