టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి రేపు(బుధవారం) సీఎం జిల్లాకు రానున్నారు.
● బుధవారం ఉదయం 8 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు.
● ఉదయం 9.20కు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
● 9:30 గంటలకు విశాఖపట్టణంలో బయల్దేరి సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 10.15 గంటలకు చేరుకుంటారు.
● 10.20 గంటలకు హెలీప్యాడ్ వద్ద నాయకులు సీఎంకు స్వాగతం పలుకుతారు.
● 10.25 గంటలకు హెలీప్యాడ్ నుంచి పోర్టు శంకుస్థాపన పైలాన్ ఆవిష్కరణకు బయల్దేరుతారు.
● 10:30 నుంచి 10:47 వరకు పోర్టు శంకుస్థాపన, గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
● 11 గంటలకు మళ్లీ హెలీకాప్టర్‌లో బయల్దేరి 11.10 గంటలకు నౌపడ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
● 11.10 నుంచి 11.20 వరకు హెలీప్యాడ్ వద్ద నాయకులంతా సీఎంకు స్వాగతం పలుకుతారు.
●11.25 గంటల నుంచి 11.35 వరకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు.
● 11.45 నుంచి 12 గంటల వరకు సభా వేదికపై ఇతర నాయకులు ప్రసంగిస్తారు.
● మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు సభా వేదికపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగం చేస్తారు.
● 12.35 గంటలకు మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.
● 12.40 గంటలకు సభా వేదిక నుంచి బయల్దేరి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
● 12.45 నుంచి 1.05 వరకు స్థానిక నాయకులతో మాట్లాడుతారు.
● మధ్యాహ్నం 1.10 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
● మధ్యాహ్నం 2.10 గంటలకు విశాఖపట్టణం నుంచి గన్నవరం చేరుకుంటారు.
● మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
చదవండి: AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment