Greenfield port
-
కాకినాడకు మరో కిరీటం
రామాయపట్నం.. మూలపేట.. మచిలీపట్నం పరంపరలో రాష్ట్రంలో మరో పోర్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే మూడు పోర్టులు (కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ క్యాపిటివ్) ఉన్న కాకినాడ సిగలో త్వరలో మరో పోర్టు చేరనుంది. కాకినాడ సమీపంలోని తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద సుమారు 1,944 ఎకారాల్లో కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టు (కే–సెజ్ పోర్టు)ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మిస్తున్న ఈ పోర్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. తొలిదశలో సుమారు రూ.2,123.43 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఏడాదికి 16 మిలియన్ టన్నుల సామర్థ్యం, నాలుగు బెర్తులతో అరబిందో గ్రూపు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. 2023 ప్రారంభంలో మొదలైన ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్‌ను నిర్మించడానికి 12 లక్షల టన్నుల రాయిని ఇప్పటివరకు వినియోగించారు. బ్రేక్ వాటర్ నిర్మాణం ఇప్పటికే 45 శాతం మేర పూర్తికాగా మొత్తం ప్రాజెక్టులో పనులు 18 శాతం వరకు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. – సాక్షి, అమరావతి పర్యావరణ అనుమతులు మంజూరు.. 5,886 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కాకినాడ సెజ్ మధ్యలో ఈ పోర్టు నిర్మాణం జరుగుతోంది. మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ జోన్‌గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఈ మధ్యనే కీలక అనుమతులు లభించాయి. ఈ పోర్టు నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయంలో 2.70 శాతం ప్రభుత్వానికి రానుండగా.. 31–40 ఏళ్ల వరకు 5.40 శాతం, 41–50 ఏళ్ల వరకు 10.80 శాతం వాటా ఏపీ మారిటైమ్ బోర్డుకు సమకూరనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి పరోక్షంగా 10,000 మందికి చొప్పున మొత్తం 13,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టు లావాదేవీలు, పరిశ్రమల రాకతో రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఆదాయం, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని ఆర్థికవేత్తలు స్పష్టంచేస్తున్నారు. మౌలిక వసతులకు భారీ వ్యయం.. ► కే–సెజ్ గేట్‌వే పోర్టును ఇటు కాకినాడతో పాటు అటు అన్నవరం వద్ద జాతీయ రహదారికి రోడ్డు, రైల్వేలైన్ ద్వారా అనుసంధానించనున్నారు. ► సాగరమాల ప్రాజెక్టుకు కింద 40.కి.మీ మేర నాలుగులైన్ల రహదారిని రూ.1,480 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ► అలాగే, ఈ పోర్టును అన్నవరానికి అనుసంధానిస్తూ రూ.300 కోట్లతో 25కి.మీ మేర రైల్వేలైన్‌ను ఏర్పాటుచేయనున్నారు. ► 24 నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా 400/200 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయడానికి ట్రన్స్కోకు 64 ఎకరాలను కేటాయించారు. 2,000 ఎంవీఏ విద్యుత్‌ను ఉత్పత్తి సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా ఈ సబ్‌స్టేషన్‌ను అనుసంధానిస్తున్నారు. ► ఈ సెజ్‌లోని పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థాలను శుద్ధిచేయడానికి ఒక ఉమ్మడి ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయడమే కాకుండా ఈ వ్యర్థాలను గొట్టాల ద్వారా 35 కి.మీ దూరంలోని పాయకరావుపేటవరకు తరలించి అక్కడ నుంచి సుమారు రెండు కి.మీ లోతున సముద్రంలో కలపనున్నారు. ► ఇక్కడ యూనిట్లకు అవసరమైన నీటిని పోలవరం కాలువతో పాటు సుముద్రపు నీటిని శుద్ధిచేసుకుని వినియోగించుకునేందుకు డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ► అన్నవరం నుంచి పోలవరం కాలువ ద్వారా 100 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయడంతో పాటు రూ.100 కోట్లతో డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. రూ.50,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఇలా అన్ని మౌలిక వసతులతో పోర్టు అభివృద్ధి చేస్తుండటంతో ఈ పోర్టు పక్కనే దివీస్ భారీ ఫార్మా యూనిట్, రూ.2,000 కోట్లతో లైఫియస్ ఫార్మా పేరుతో పెన్సులిన్ తయారీ యూనిట్‌ను.. రూ.2,000 కోట్లతో క్యూలే ఫార్మా యూనిట్‌ను అరబిందో ఫార్మా ఏర్పాటుచేస్తోంది. వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఈ సెజ్ ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ,5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ హైడ్రోజన్, టెక్స్టైల్స్, ఆక్వా, స్టీల్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. కాకినాడ సెజ్‌కు ఆనుకుని ఉన్న ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మినీపోర్టు తరహాలో భారీ ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తుండటంతో ఆక్వా రంగానికి చెందిన పలు సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే నెక్కంటి సీ ఫుడ్స్, దేవీ ఫిషరీస్, సంధ్య ఆక్వా, కాంటినెంటల్ ఫిషరీస్, ఆదివిష్ణు వంటి పలు సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించి 8,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందులో అత్యధికమంది మహిళలు.. పైగా స్థానికులే కావడం గమనార్హం. 2025 నాటికి అందుబాటులోకి తెస్తాం.. ఇప్పటికే కీలకమైన బ్రేక్ వాటర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే డ్రెడ్జింగ్ బెర్తుల నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం. బ్యాంకులతో రుణాల ద్వారా నిధుల సమీకరణ పూర్తికావడంతో ఇక పనులు వేగవంతం కానున్నాయి. 2025 ద్వితీయ త్రైమాసికం నాటికి పోర్టును పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఓం రామిరెడ్డి, ఎండీ, కాకినాడ గేట్‌వే పోర్ట్స్ లిమిటెడ్ మా వాళ్లకు ఉద్యోగాలొస్తాయన్న ఆశ.. నాకున్న నాలుగెకరాల భూమి సెజ్‌కు ఇచ్చాను. ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మాలాంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. మా వాళ్లు బాగుపడతారనే నమ్మకంతో భూమి ఇచ్చాను. అందుకు తగ్గట్లుగానే సెజ్‌లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాను. పెద్దగా చదువుకోకున్నా భూమి ఇచ్చాననే కారణంతో ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. – యాదాల చంటిబాబు. ఆవులమంద, పెరుమాళ్లపురం, తొండంగి మండలం ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయి.. గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. గతంలో పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు సెజ్‌లో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సెజ్‌కు భూమి ఇచ్చిన వారిలో నేను ఒకడిని. గత పాలనలో కొంతమందిని బెదిరించి భూములు లాక్కున్నారు. అప్పట్లో నాపై అన్యాయంగా 15 కేసులు బనాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక గత డిసెంబరు 26న 12 కేసులు ఎత్తేశారు. మరో 3 కేసులు నాపై పెండింగ్‌లో ఉన్నాయి. – దూలం శ్రీను, గోర్సపాలెం, తొండంగి మండలం -
CM Jagan Srikakulam Tour: సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం (ఫొటోలు)
-
ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే: సీఎం జగన్
Updates దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా.. ‘‘మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు’’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ కీలక ప్రకటన ►శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామన్నారు. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం తెలిపారు. ►ఇవాళ నాలుగు మంచి కార్యక్రమాలు జరుపుకున్నాం: సీఎం జగన్ ►మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం ►నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేసుకున్నాం ►ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం ►ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చివేస్తాయి ►గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారు ►ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుంది ►భవిష్యత్‌లో మూలపేట, విష్ణు చక్రం మరో ముంబై, మద్రాస్ కాబోతున్నాయి ►24 నెలల్లో పోర్ట్ పూర్తవుతుంది ►పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్లు ఖర్చు చేస్తున్నాం ►పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 35వేల మందికి ఉపాధి లభిస్తుంది ►పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి ►అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ►మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు ►గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ►గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి ►పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ►బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ►రాష్ట్రంలో ఇప్పటివరకు 4 పోర్టులు మాత్రమే ఉండగా.. మనం అధికారంలోకి వచ్చాక మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం తీరప్రాంత అభివృద్ధికి సంబంధించి గతంలో ఇలాంటి అభివృద్ధి ఎందుకు జరగలేదు? ►సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన చరిత్రలో గుర్తుండిపోయేలా.. ►చరిత్రలో గుర్తుండిపోయేలా మూలపేట పోర్టుకు ఈ రోజు శంకుస్ధాపన జరిగిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దాదాపు 30 నెలల్లో పూర్తి చేయనున్న ఈ పోర్టు ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది స్ధానిక యువతకు ఉపాధి కల్పించబోతున్నారన్నారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను అనేక ప్రభుత్వాలను చూశాం, ఈ రోజు మన రాష్ట్రానికి సహజసిద్దంగా ఉన్నటువంటి సముద్రతీరాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలని, తద్వారా ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో సీఎం 2019లో ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏర్పాటు చేసి దాదాపు రూ. 16 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టు, మరో 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నారు. ఈ ఘట్టం శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతుంది.రానున్న కాలంలో ఈ ప్రాంతంలో మరిన్ని మంచి కార్యక్రమాలు సీఎంద్వారా చేస్తామని మంత్రి అన్నారు. 75 ఏళ్ల చరిత్రలో ఇవాళ చరిత్రాత్మక ఘట్టం: ఎమ్మెల్సీ దువ్వాడ ►నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిరహిత పాలన అందిస్తున్నారన్నారు. రైతులను విత్తనం నుంచి విక్రయం వరుకు ఆదుకుంటున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. ►మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు ►సీఎం జగన్ మూలపేటలో పర్యటిస్తున్నారు. గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ►సీఎం వైఎస్ జగన్ మూలపేటకు చేరుకున్నారు. కాసేపట్లో మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ►శ్రీకాకుళం జిల్లా మూలపేట పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు. ►విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. ►శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి. ►వచ్చే నెలలో మచిలీపట్నం (బందరు) పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్లలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్ల లోపే నాలుగు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విశేషం. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి. -
సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి రేపు(బుధవారం) సీఎం జిల్లాకు రానున్నారు. ● బుధవారం ఉదయం 8 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు. ● ఉదయం 9.20కు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ● 9:30 గంటలకు విశాఖపట్టణంలో బయల్దేరి సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 10.15 గంటలకు చేరుకుంటారు. ● 10.20 గంటలకు హెలీప్యాడ్ వద్ద నాయకులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ● 10.25 గంటలకు హెలీప్యాడ్ నుంచి పోర్టు శంకుస్థాపన పైలాన్ ఆవిష్కరణకు బయల్దేరుతారు. ● 10:30 నుంచి 10:47 వరకు పోర్టు శంకుస్థాపన, గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ● 11 గంటలకు మళ్లీ హెలీకాప్టర్‌లో బయల్దేరి 11.10 గంటలకు నౌపడ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ● 11.10 నుంచి 11.20 వరకు హెలీప్యాడ్ వద్ద నాయకులంతా సీఎంకు స్వాగతం పలుకుతారు. ●11.25 గంటల నుంచి 11.35 వరకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. ● 11.45 నుంచి 12 గంటల వరకు సభా వేదికపై ఇతర నాయకులు ప్రసంగిస్తారు. ● మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు సభా వేదికపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగం చేస్తారు. ● 12.35 గంటలకు మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ● 12.40 గంటలకు సభా వేదిక నుంచి బయల్దేరి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ● 12.45 నుంచి 1.05 వరకు స్థానిక నాయకులతో మాట్లాడుతారు. ● మధ్యాహ్నం 1.10 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ● మధ్యాహ్నం 2.10 గంటలకు విశాఖపట్టణం నుంచి గన్నవరం చేరుకుంటారు. ● మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. చదవండి: AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ -
గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి
న్యూఢిల్లీ: దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే సాగరమాల ప్రాజెక్టు ద్వారా నౌకాయాన రంగంలో జలమార్గాలు, పోర్టు ఆధారిత ఆర్థికాభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. జాతీయ జలమార్గాల అభివృద్ధి కోసం రూ. 800 కోట్లు అందించామని...ఆ పనులను వేగవంతం చేశామని వివరించారు. 12 ప్రధాన పోర్టులను ఆధునీకరించి వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. సాగరమాల ప్రాజెక్టు ద్వారా కనీసం రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలనుకుంటున్నామన్నారు. నౌకాయాన రంగంపై జైట్లీ పేర్కొన్న ఇతరాంశాలు.. ♦ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్రధాన పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఇండియన్ కస్టమ్స్ సింగిల్ విండో ప్రాజెక్టు అమలు. ♦ మరింత మంది దిగుమతిదారులకు డెరైక్ట్ పోర్టు డెలివరీ సౌకర్యం విస్తరణ. ♦ కొన్ని తరగతుల ఎగుమతిదారులు, దిగుమతిదారులకు కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులో వాయిదా సౌలభ్యం అందించేందుకు కస్టమ్స్ చట్టానికి సవరణ.