
సాక్షి,శ్రీకాకుళం : కూటమి ప్రభుత్వంలో రోజురోజుకూ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా,సంతబొమ్మాళి మండలం లక్కవరం గద్దెలపాడులో దారుణం జరిగింది. ఆశ వర్కర్ పోస్టుకు కూటమి నేతలు రూ.లక్షా 90వేలకు వేలం వేశారు.
అయితే, డబ్బులు కట్టేందుకు నిరాకరించడంతో ఆశావర్కర్ చంద్రమ్మను గ్రామ పెద్దలు సంఘ బహిష్కరణ చేశారు. బాధితురాలి కుటుంబంతో ఎవరూ మాట్లాడవద్దంటూ గ్రామంలో దండోరా వేయించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధిత ఆశావర్కర్ చంద్రమ్మ,యూనియన్ నేతలు డీఎంహెచ్‌ఓను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment