Asha Workers problems
-
బేగం బజార్ సీఐపై చేయిచేసుకున్న ఆశా వర్కర్స్
-
చంద్రబాబు సర్కార్ మోసం రోడ్డెక్కిన ఆశ వర్కర్లు
-
ఏపీలో సమస్యల పరిష్కరం కోసం కార్మికుల ఆందోళన
-
రేవంత్ సారు మీ హామీ ఎక్కడ?
-
ఆశా వర్కర్ల జీతాలు పెంచాలంటూ బీజేపీ మహిళా మోర్చ నిరసన
-
ఆందోళన పథం
కేశంపేట: ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందేందుకు కృషి చేస్తున్న ఆశ కార్యకర్తల జీవితాలు సంతోషంగా లేవు. ఆరు నెలలుగా వారికి వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. గ్రామాల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు ప్రతి కుటుంబం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు టీకాలను సకాలంలో అందజేస్తున్నారు. అదేవిధంగా కుష్టు, క్షయతో పాటు ఇతర అంటువ్యాధుల నివారణకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గ్రామాల పైన పూర్తి అవగాహన ఉండడంతో వీరి సాయంతో సర్కారు పోలియో, కంటివెలుగు తదితర కార్యక్రమాలను విజయవంతం చేస్తోందని చెప్పవచ్చు. ఇంతటి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఆశ కార్యకర్తలను సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. వారికి నెలకు రూ. 7,500 చొప్పున అందిస్తున్న వేతనాలను 6 నెలలుగా చెల్లించడం లేదు. దీంతో వారికి పూటగడవడం కష్టంగా మారడంతో పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించింది. పలుమార్లు తమ వేతనాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ‘ఆశ’ల బాధ్యతలు మాతా శిశుసంరక్షణ, ఆసుపత్రిలో ప్రసవాలు చేయించడం, గర్భిణులు, చిన్నారులకు సకాలంలో టీకాలు ఇప్పించడం ఆశ కార్యకర్తల ముఖ్య విధి. గ్రామాల్లో అంటువ్యాధులు సోకిన వారికి ప్రాథమిక చికిత్స అందించడం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం తదితర విధులను నిర్వహిస్తారు. క్షయ, కుష్టు బాధితులకు ఎప్పటికప్పుడు మాత్రలు, మందులు అందజేయడం వీరి విధి. దీంతోపాటు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తుంటారు. గర్భిణుల ప్రసవం కోసం వారిని పీహెచ్‌సీలకు తరలిస్తుంటారు. జిల్లాలో 1,123 మంది ఆశ కార్యకర్తలు పని చేస్తున్నట్టు జిల్లా వైధ్యాధికారులు తెలిపారు. ఆశ కార్యకర్తల కోసం నిధులు మంజూరు కాకపోవడంతో పారితోషికం అందించడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. వెంటనే చెల్లించాలి ప్రభుత్వం మా సేవలను గుర్తించి రూ. 6 వేలుగా ఉన్న పారితోషికాన్ని 7,500లకు పెంచింది. కానీ, ఎప్పడూ సరిగా అందడం లేదు. సక్రమంగా పారితోషికం ఇవ్వాలి. ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. పెంచిన పారితోషికాన్ని వెంటనే చెల్లించాలి. – లలిత, ఆశ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు పోషణ భారంగా మారింది. ఆరు నెలలుగా పారితోషికం లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. మాకు చెల్లించాల్సిన పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలి. కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నాం. మా పారితోషికం విషయంలో సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలి. – వసంత, ఆశకార్యకర్త కేశంపేట -
ఆశ వర్కర్లకు షరతులు వర్తిస్తాయి!
ఎన్నో పోరాటాలు చేశారు. పోలీసు దెబ్బలు తిన్నారు. అవమానాలు చవిచూశారు. ఏమైతేనేం అనుకున్నది సాధించామని సంతోషించారు. ఇచ్చింది స్వల్పమైనా అనంతానందం పొందారు. కృతజ్ఞతతో సన్మానాలు చేశారు. చిత్రాలకు పాలాభిషేకం చేశారు. ఇంతలోనే వారి ‘ఆశ’లపై నీళ్లు చల్లుతూ కొత్త ఉత్తర్వులు వెలుడ్డాయి. ఇదీ ఆశ వర్కర్లపై సర్కారు అనుసరించిన వైఖరి. ముఖ్యమంత్రి తమ కోర్కెలు తీర్చేశారని సంబరపడితే... కొత్తగా పెట్టిన కండిషన్లతో వారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. బొబ్బిలి: అరవ చాకిరీ చేయించుకుంటూ కూడా ఆశ వర్కర్లకు వేతనం పెంచామని సన్మానాలు, సత్కారాలు, పాలాభిషేకాలు చేయించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు స్వరూపం మరోసారి బహిర్గతమైంది. ఆశ వర్కర్ల వేతనం పెంపు వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని నిరూపించారు. పెంచిన వేతనం రూ.5,600 అందా లంటే ప్రతీ ఆశ వర్కర్ నెలకు నలుగురు గర్భిణులను నమోదు చేసి, నాలుగు డెలివరీలు చేయించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వేతనాల కోసం ఏటా ఎదురు చూస్తున్న ఆశ వర్కర్లకు నెలకు రూ.3 వేలు, పారితోషకంగా మరో మూడు వేలుఇస్తామన్న రాష్ట్ర సర్కారు ఇప్పుడు రూ.5,600ను ప్రకటించింది. ఆ డబ్బులు కూడా లక్ష్యాన్ని సాధిస్తేనే ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సేవలు వినియోగించుకుని ఇలా లక్ష్యాలను విధించడం అన్యాయమని వారు వాపోతున్నారు. పోరాటంతో దిగొచ్చిన సర్కారు జిల్లాలో 5,600 మంది ఆశ వర్కర్లున్నారు. వీరిని సబ్ సెంటర్ల వారీగా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. వివిధ సర్వేలు, పల్స్‌పోలియో, చిన్నారులకు టీకాలు వంటి కార్యక్రమాలకు ఇంటింటికీ తిరుగుతూ ఒళ్లు హూనం చేసుకుంటున్నా... వారికి నెలకు ఇచ్చేది మూడు వేలే. ఈ సొమ్మును మరో మూడు వేలు పెంచి ఆరు వేలు చేస్తున్నామని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. కానీ దానిని అమలు చేయలేదు. ఇక అందరి మాదిరి వారూ ఆందోళనలకు దిగారు. పోలీసులచేత ఈడ్చివేతలు... అధికారులతో ఛీత్కారాలు తిన్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కాదని, రూ.5,600 ఇస్తామని ప్రకటించారు. తాజాగా పెట్టిన మెలికలు వెయ్యి జనాభా నుంచి రెండు వేల జనాభా ఉన్న సబ్ సెంటర్ల వారీగా లక్ష్యాలు విధించారు. ఒక్కొక్కరూ నలుగురు గర్భిణులను నమోదు చేయాలి, నాలుగు డెలివరీలు చేయించాలి. వీటితో పాటు నలుగురు బిడ్డలకు మీజిల్స్ వేయించాలి. మరో నాలుగు బూస్టర్ డోసులు వేయించాలి. ఇలా రోజూ వారు గర్భిణుల కోసం, బాలింతల కోసం వెతకాల్సిందే. ఒక వేళ ఆ ప్రాంతంలో గర్భిణులు లేకపోతే వీరికి వేతనం లేనట్టేనని చెబుతున్నారని ఆశా వర్కర్లు వాపోతున్నారు. బర్త్సర్టిఫికెట్లు అంగన్వాడీలకు అప్పగించాలి ఆశ వర్కర్లు తాము పనిచేస్తున్నట్టు రుజువు చేసేందుకు సవాలక్ష నిబంధనలు విధించింది ప్రభుత్వం. బిడ్డలు పుట్టినట్టు ఆస్పత్రిలో ఇచ్చే సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంది. అలాగే పుట్టిన బిడ్డ అత్తవారు, కన్నవారింటికి మారినప్పుడు అక్కడి అంగన్వాడీ సెంటర్‌కు అప్పగించే బాధ్యత కూడా ఆశ వర్కర్లదే. దీంతో తాము చేసిన పనులు ఏమన్నా తక్కువ చేస్తున్నామా? పనికి తగిన వేతనం ఇస్తున్నారా? మాకెందుకీ లక్ష్యాలని వాపోతున్నారు. వర్కర్లతో విరివిగా సమావేశాలు ఆశ వర్కర్లకు వేతనం పెంచినట్టే పెంచి లక్ష్యాలను బారెడు చేసిన ప్రభుత్వం వారి కోసం విడుదల చేసిన లక్ష్యాలు, నిబంధనలపై రిపోర్టులు తీసుకుంటోంది. ఇందుకోసం ఏఎన్ఎంల ఆధ్వర్యంలో ఆశ వర్కర్లకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో మీరు చేయాల్సిన పనులివీ అని వారికి వివరిస్తున్నారు. పెరిగిన వేతనం అందుకోవాలంటే ఈ మాత్రం చేయకతప్పదని వారికి సుద్దులు చెబుతున్నారు. దీంతో ఆశ వర్కర్లు మరింత ఆవేదన చెందుతున్నారు. బర్త్ సర్టిఫికేట్లు అప్పగిస్తేనే వేతనమట మాకు లక్ష్యాలు ఇచ్చి వాటి ప్రకారం గర్భిణులు, బాలింతలను నమోదు చేయాలంటున్నా రు. బిడ్డ పుట్టిన తరువాత వారిని అంగన్వాడీలకు అప్పగించాలని ఆదేశించారు. లేకుంటే వేతనం లేదని, కట్ అవుతుందని ముందుగానే మాకు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫారంలో అన్ని కాలమ్స్‌ను మాచేత నింపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. జీతం పెంపు అంటే ఇదేనా? – ఎల్ శాంతి, అధ్యక్షురాలు, ఆశ వర్కర్ల అసోసియేషన్. -
స్తంభించిన గ్రామీణ వైద్యం
సాక్షి, హైదరాబాద్: ‘ఆశ’ వ ర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైంది. 24 రోజులుగా వేలాది మంది ఆశ కార్యకర్తలు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడంలేదు. వారితో చర్చలు జరిపి సమ్మె విరమింపజేయడంలో సర్కారు పెద్దలు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలున్నాయి. వ్యాధుల సీజన్లో ‘ఆశ’ వర్కర్ల సమ్మె.. పల్లెల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. డెంగీ, మలేరియా, చికున్ గున్యా, విష జ్వరాలతో పల్లెలు విలవిలలాడుతుంటే.. ఈ సమ్మె పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. పారితోషికాలు కాకుండా కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని ఆశ వర్కర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని కోరుతున్నారు. రెండ్రోజుల క్రితం మంత్రి లక్ష్మారెడ్డితో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు ఆశ వర్కర్లు సన్నద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నారు. ఈ లోపు జిల్లాల్లో నిరవధిక నిరాహార దీక్షలకు రంగం సిద్ధం చేశారు. సమ్మెలో 25 వేల మంది... రాష్ట్రంలో 25 వేల మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. పదే ళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) మార్గదర్శకాల ప్రకారం వీరిని నియమించారు. కుటుంబ నియంత్రణ, ఆసుపత్రిలో కాన్పు, ఇమ్యునైజేషన్ వంటి వాటితోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అయితే వీరికి ప్రభుత్వం నామమాత్రపు పారితోషికాలను ఇస్తోంది. పనిని బట్టి నెలకు ఒక్కో ఆశ వర్కర్‌కు రూ. 400 నుంచి రూ. 2 వేల వరకు ఇస్తున్నారు. రోజంతా పల్లెల్లో తిరిగితే వచ్చే ఈ పారితోషికం ఏమాత్రం సరిపోవడంలేదు. కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని అనేకసార్లు ఆందోళనలు నిర్వహించినా స్పందన లేదు. పశ్చిమబెంగాల్, కేరళ, హర్యానా రాష్ట్రాలు పారితోషికాలతోపాటు నిర్ణీత వేతనాలు ఇస్తున్నాయని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే వేతనాలు నిర్ణయించాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని.. నిరవధిక దీక్షలు, చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.