అమరావతి, సాక్షి: వ్యవసాయ బడ్జెట్‌లో రైతన్నలకు కూటమి ప్రభుత్వం పెద్ద షాకేచ్చింది. రైతుల పెట్టుబడి సహాయం హామిపై చంద్రబాబు ప్రభుత్వం అంతరిక్ష పల్టీలు కొట్టింది. ఇవాళ్టి బడ్జెట్ ప్రసంగ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలు ఈ విషయాన్ని తెలియజేశాయి.
తన మేనిఫెస్టోలో రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది కూటమి. అయితే.. తీరా ఇప్పుడు కేంద్రం ఇచ్చే 6 వేలుతో కలిపి అన్నదాత సుఖీభ కింద ఇస్తామంటూ చెబుతోంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. అన్నదాత సుఖీభవకి కేవలం రూ. 4,500 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించింది. వాస్తవానికి..
ఏపీలో వాళ్లు ఇచ్చిన హామీ ప్రకారం పెట్టుబడి సహాయం కింద.. 52 లక్షల మంది రూ. 10 వేల కోట్లకు పైగా అవసరం. కానీ, సగం కంటే తక్కువ కేటాయింపులతో భారీగా లబ్ధిదారులకు కోత పెట్టబోతున్న సంకేతాలను పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment