Agriculture Budget 2024
-
వ్యవసాయ బడ్జెట్: రైతుల్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు!
అమరావతి, సాక్షి: వ్యవసాయ బడ్జెట్లో రైతన్నలకు కూటమి ప్రభుత్వం పెద్ద షాకేచ్చింది. రైతుల పెట్టుబడి సహాయం హామిపై చంద్రబాబు ప్రభుత్వం అంతరిక్ష పల్టీలు కొట్టింది. ఇవాళ్టి బడ్జెట్ ప్రసంగ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలు ఈ విషయాన్ని తెలియజేశాయి. తన మేనిఫెస్టోలో రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది కూటమి. అయితే.. తీరా ఇప్పుడు కేంద్రం ఇచ్చే 6 వేలుతో కలిపి అన్నదాత సుఖీభ కింద ఇస్తామంటూ చెబుతోంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. అన్నదాత సుఖీభవకి కేవలం రూ. 4,500 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించింది. వాస్తవానికి.. ఏపీలో వాళ్లు ఇచ్చిన హామీ ప్రకారం పెట్టుబడి సహాయం కింద.. 52 లక్షల మంది రూ. 10 వేల కోట్లకు పైగా అవసరం. కానీ, సగం కంటే తక్కువ కేటాయింపులతో భారీగా లబ్ధిదారులకు కోత పెట్టబోతున్న సంకేతాలను పంపించింది. 👉 ఏపీ వ్యవసాయ బడ్జెట్ 2024 పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండి -
వ్యవ‘సాయం’ అందుతుందా..?
భారత్‌లో ఉపాధి కల్పించే రంగాల్లో వ్యవసాయం కీలకపాత్రం పోషిస్తోంది. దేశంలో 42 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ సర్కారు హామీ గతంలో కరోనా, ఆర్థిక సంక్షోభాల కారణంగా పూర్తి కాలేదు. అసలే ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చూసుకోవడం కేంద్రానికి సవాలుగా మారనుంది. దీనికి తోడు వ్యవసాయం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవడం కీలకం. అప్పుడే ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా అన్నదాత ఆదాయం హెచ్చవుతుందని నిపుణలు చెబుతున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో నీటిపారుదల రంగానికి కేటాయింపులు, నాణ్యమైన విత్తనాలు, టెక్నాలజీ వంటివి ఆర్థిక మంత్రికి కీలకంగా మారనున్నాయి. సవాలు విసురుతున్న పరిస్థితులు.. వ్యవసాయ, పశుపోషణ రంగానికి కీలకమైన డీజిల్, విద్యుత్తు, పశువుల దాణా, మేత ఖర్చులు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ రంగంలో ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా పెరుగుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఈ ఏడాది ఆలస్యం కావడంతో పంట దిగుబడుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దాంతో కొన్ని ప్రాంతాల్లో ఆహారకొరత ఏర్పడుతోంది. వ్యవసాయ ఎగమతులు తగ్గుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు గోధుమ పంటను దెబ్బతీశాయి. గోధుమలు, చక్కెర ఉత్పత్తులను కేంద్రం ఇప్పటికే నిలిపేసింది. ఆధునికీకరణకే పెద్దపీట.. భారత్‌లో వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతోంది. దీనికి భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. దీంతో వాటి ఉత్పత్తుల నాణ్యత కూడా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో మన రైతులు అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. భారత్‌లో రైతుల ఉత్పత్తి.. అంతర్జాతీయ మార్కెట్ల అంచనాలకు మధ్య చాలా అంతరం ఉంది. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీలను తీసుకురావాల్సి ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రైతులకు సాంకేతికత, దానికి సంబంధించిన పరికరాలు చౌకగా లభించేందుకు ఈ రంగంలోని స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెబుతున్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకురావడానికి 2022 బడ్జెట్లోనే పునాదులు వేశారు. కిసాన్ డ్రోన్లను ప్రమోట్ చేసేలా అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు నాబార్డ్ కింద ఓ నిధిని ఏర్పాటు చేసింది. బ్లాక్‌చైన్, కృత్తిమ మేధ, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను వ్యవసాయ రంగానికి అన్వయించడమే అసలైన సవాలు. 2024-25 బడ్జెట్లో వీటికి ప్రత్యేక కేటాయిపులు చేయడంతో పాటు.. పన్ను రాయితీలు ఇవ్వాలని కొందరు కోరుతున్నారు. వ్యవసాయ రుణాలు రూ.22-25 లక్షల కోట్లు..? 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న తాత్కాలిక బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సమాచారం. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.20 లక్షల కోట్లు. ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఇచ్చే స్వల్పకాల వ్యవసాయ రుణాలపై 2% వడ్డీ రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే.. అందువల్లే రూ.3 లక్షల వరకు రుణాలు 7% వడ్డీ రేటుకే లభిస్తున్నాయి. గడువులోపు బకాయిలు తీర్చేవారికి అదనంగా మరో 3% వడ్డీ మినహాయింపూ ఉంటుంది. దీర్ఘకాల రుణాలనూ రైతులు తీసుకోవచ్చు కానీ.. మార్కెట్ రేటు ప్రకారమే వడ్డీ రేటు ఉంటుంది. -
వ్యవసాయానికి బడ్జెట్ ప్రతిపాదనలు రూ.40,000 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.40 వేల కోట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. బడ్జెట్‌పై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కసరత్తు చేసిన వ్యవసాయ శాఖ గతం కంటే అధికంగా నిధులు కేటాయించాలని కోరడం విశేషం. 2022–23 బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించగా, 2023–24లో రూ.26,831 కోట్లు కేటాయించింది. కాగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ మొదటి బడ్జెట్లో ఏకంగా రూ.40 వేల కోట్లు కేటాయించాలంటూ వ్యవసాయ శాఖ ప్రతిపాదించడం.. రైతుల పట్ల సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందనడానికి నిదర్శనమని అధికార వర్గాలు అంటున్నాయి. రుణమాఫీ, రైతు భరోసాకే అధికం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అలాగే రైతుభరోసా పేరుతో అన్నదాతలకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. రెండు పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయనుంది. దీనితో వీటికి అధిక మొత్తంలో నిధులు అవసరం. బీఆర్ఎస్ ప్రభుత్వం 36.68 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీకి మొత్తం రూ.19,198.38 కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే దాదాపు రూ.13 వేల కోట్ల వరకు మాత్రమే మాఫీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలంటే మొత్తం రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని, వడ్డీలతో కలిపి రూ.36 వేల కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా. కాగా మొదటి సంవత్సరానికి గాను రూ.7,200 కోట్లు చెల్లించేలా వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసింది. బ్యాంకులకు నెలసరి వాయిదాల్లో.. రుణమాఫీ నిధులను బ్యాంకులకు ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నోడల్ బ్యాంకుతో ఒక దఫా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అవసరమైతే ఆర్బీఐతోనూ చర్చించాలని, బ్యాంకులకు నెలసరి వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించినప్పటికీ, రుణమాఫీ ఒకేసారి చేసేలా బ్యాంకులను ఒప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలావుండగా రుణమాఫీకి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ (గడువు తేదీ)పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రుణమాఫీ ఎలా చేయాలన్న దానిపై త్వరలో మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి. ఇక రైతుబంధు కోసం 2023–24 బడ్జెట్లో రూ.15,075 కోట్లు కేటాయించారు. తాజాగా రైతుభరోసా సొమ్ము కూడా పెరగడంతో బడ్జెట్ కూడా పెంచాల్సి ఉంది. కాబట్టి రూ.22,500 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా కాగా.. ఆ మేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపింది. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణపైనా దృష్టి సారించాలని, ఆ మేరకు రూ.500 కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. రైతు బీమాకు ప్రభుత్వం 2022–23లో రూ.1,466 కోట్లు కేటాయిస్తే, 2023–24 బడ్జెట్లో రూ.1,589 కోట్లు కేటాయించింది. ఈసారి రూ.1,600 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు 2023–24 బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించింది. ఈసారి కూడా అంతే మొత్తంలో కేటాయించాలని ఉద్యానశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. రైతులకు విత్తనాలు సరఫరా చేసేందుకు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి, రైతు వేదికలకు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు, మైక్రో ఇరిగేషన్ తదితరాలకు కూడా నిధులు కోరుతూ వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఇక రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. దీన్ని అమలు చేయాలంటే ఆ మేరకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది.