సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఢిల్లీ సెంటర్‌లో దించి నువ్వు ఎక్కడికై నా వెళ్లు అంటే దారి తెలియనటువంటి వ్యక్తి. ఇంగ్లిష్, హిందీ రాని వ్యక్తికి పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చారు. అటువంటి వ్యక్తి కింజరాపు రామ్మోహన్ నాయుడిపై పోటీ అట. ఆయనతో పోటీ చేయాలంటే ఎవరైనా భయపడతారు’ శ్రీకాకుళం వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సమన్వయకర్త పేరాడ తిలక్‌పై ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి.
అచ్చెన్న దురహంకారానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనాలు. పట్టభద్రుడైన పేరాడ తిలక్‌ను పట్టుకుని హేళనగా, చులకనగా మాట్లాడటంపై జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు మండి పడుతున్నారు. అచ్చెన్నాయుడు దొరల అహంకారాన్ని చూపిస్తూ అవతలి వ్యక్తులను చిన్నతనంగా, అనాగరికంగా మాట్లాడుతున్నారని దుయ్యబడుతున్నారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని అవమాన పరిచేలా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం జిల్లా అంతటా చర్చ జరుగుతోంది.
అచ్చెన్నా.. ఇది తగునా..!
ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పిల్లల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెడితే కోర్టులకెళ్లి అడుగడుగునా అచ్చెన్న అడ్డు తగిలారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువులు ఎందుకు, ఇంగ్లిష్ నేర్చుకుంటే ఏమొస్తుంది, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియమేంటి, పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోకూడదు, పైస్థాయికి వెళ్లకూడదన్నట్టుగా అచ్చెన్న వ్యవహరించారు. ఇప్పుడదే నోటితో ఇంగ్లిష్ రాని వ్యక్తికి పార్లమెంట్ టిక్కెటా.. అని అనడం అచ్చెన్న దిగజారుడు రాజకీయాన్ని సూచిస్తోంది. ‘చదువుకున్న వ్యక్తికి ఇంగ్లిష్ పెద్ద కష్టమేమి కాదు. అలాగైతే మీ సోదరుడు, దివంగత నాయకుడు కింజరాపు ఎర్రంనాయుడుకు ఎంపీ గా వెళ్లినప్పుడు ఆయనకు వచ్చా? ఆ తర్వాత నేర్చుకున్నదే కదా?’ అని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కాళింగ సామాజిక వర్గ మేధావులు అచ్చెన్నను సూటిగా ప్రశ్నిస్తున్నారు.
పెరుగుతున్న ఆగ్రహజ్వాల..
ఇప్పటికే మండలాల వారీగా అచ్చెన్నపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిలక్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. రాజకీయాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్న పేరా డ తిలక్‌ను అడ్డుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు. రాజకీ యంగా ఎదుగుతున్న తమ నాయకుడిపై అవాకు లు చవాకులు మాట్లాడితే బుద్ధి చెబుతామని ప్రెస్‌మీట్లు పెట్టి అచ్చెన్నను హెచ్చరిస్తున్నారు.
రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు..
మాకు ఎవరూ సాటి రా రు అనే అహంకారంతో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని గొడవ పెట్టిన నువ్వు ఇంగ్లిష్ రాదని మా పార్లమెంట్ సమన్వయకర్త గురించి మాట్లాడుతావా. ప్రభు త్వ స్కూల్లో చదువుకున్న వారు రాజకీయాల కు పనికిరారా...అచ్చెన్నాయుడికి పోయే కాలం ఎక్కువైంది. ఇలాంటి దౌర్భాగ్యులకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు.
– సీదిరి అప్పలరాజు, రాష్ట్ర మత్స్య శాఖామంత్రి.
బహిరంగ చర్చకు సిద్ధమా...
ఎంపీగా పోటీ చేయాలంటే ఇంగ్లిష్, హిందీ భాషలు తెలిసి ఉండాలంటూ తెలుగు భాష సక్రమంగా రాని అచ్చెన్నాయుడు ఇటీవల వైఎస్సార్‌సీపీ నాయకు లపై ఎద్దేవా చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళం భాషల్లో ఏ చర్చకై నా సిద్ధంగా ఉన్నాను.
–దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి
ఓటమి తప్పదు..
అచ్చెన్నాయుడు ముందు తమ పార్టీ పరిస్థితి చూసుకోవాలి. రాష్ట్రమంతటా అభ్యర్థులను ప్రకటించి అప్పుడు మాట్లాడాలి. టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ల చేతిలో నువ్వు, నీ అన్నకొడుకు ఓడిపోవడం ఖాయం.
–ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment