
సాక్షి, హైదరాబాద్ : పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాలు వివరిస్తానని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడే అందరి బాగోతం బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత పదవి నుంచి తప్పుకోవాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పంపిన ఎస్‌ఎంఎస్‌పై రేవంత్ రెడ్డి ...పార్టీ నేతల వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన టీడీఎల్పీ నేత కుర్చీలో కూడా పక్క సీట్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..టీడీపీలో కొంతమంది అంతర్గత గొడవలు సృస్టిస్తున్నారని, తన పోరాటం తెలంగాణ సీఎం కేసీఆర్ మీదనే అని అన్నారు.
తాజా పరిణామాలు కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయన్నారు. కొంతమంది టీడీపీలో అంతర్గత గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విదేశీ పర్యటన ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ వచ్చేలోపే పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు కూడా సరిదిద్దుకోలేని విధంగా పార్టీని డ్యామేజీ చేసేలా కొందరు తాపత్రయపడుతున్నారని రేవంత్ అన్నారు. టీడీపీ క్యాడర్‌ను చూస్తే బాధగా ఉందని, క్యాడర్ మనోభావాలకు విరుద్ధంగా నేతలు నడవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తనను ఎంత పరుషజాలంలో దూషించినా రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా రమణ నోరు మెదపకపోవడం దారుణమని రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment