సాక్షి, జగిత్యాల: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశాన్ని అదానీ, అంబానీ, కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ హయాంలో దళితులు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. బీసీ జనగణన చేసి, వారికి న్యాయం చేస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. అందుకే 400 సీట్లు కావాలని బీజేపీ అడుగుతోందని దుయ్యబట్టారు.
కోరుట్లలో కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీజేపీని ప్రశ్నిస్తే మోదీ, అమిత్ షా తనపై కేసు పెట్టారన్నారు. ఢిల్లీ పోలీసులను ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కేసులకు రేవంత్ రెడ్డి భయపడడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్లను రుద్దు చేయడమేనా అని ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వరు, నిధులు ఇవ్వని వారు నేడు ఓట్లు ఎలా అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కార్మికుల త్యాగాలు, పొరాటాల వలనే తెలంగాణ ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికలు ప్రత్యేక పరిస్థితులలో జరుగుతున్నాయి. రాజ్యాంగంలో రిజర్వేషన్‌లు ఎత్తేసే కుట్ర జరుగుతుంది. 400 సీట్లు గెలిచి అదానీ, అంబానీలకు దోచిపెట్టాలని చూస్తున్నారు. కుల గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. నేను బిజెపి ని ప్రశ్నిస్తే ఢిల్లీలో కేసు పెట్టారు.
చదవండి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
పదేళ్లు కేసీఆర్ భయపెట్టాలని చూశాడు.కేసులు పెట్టినోళ్ళను అధికారంలో లేకుండా చేశాం. ఒక ప్రధానిగా నరేంద్ర మోదీ కనబడితే నమస్కరిస్తా. గుజరాత్ వాడిగా తెలంగాణకు వస్తున్నాడు. తెలంగాణకు వచ్చిన వాటిని రద్దు చేసిన వ్యక్తి మోదీ. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్ రద్దు చేయడమేనా? మెట్రో రైలుకి అనుమతులు ఇవ్వాలని అడిగితే స్పందనలేదు. నీటి కేటాయింపులు అడిగితే స్పందించలేదు. తెలంగాణ ఏర్పాటును అగౌరపరిచిన వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయన తన స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నాడు.
దలితులు,గిరిజనులు ఇంకా చితికి పోవాలా. గుజరాత్ నుంిచి వచ్చి తెలంగాణలో పెత్తనం ఏంటి? గుజరాత్ అహాంకారానికి, తెలంగాణ అత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం.మనకి విభేదాలు ఉన్న ఊరుకానొడు వస్తే తరిమికొట్టాలి. రేవంత్ రెడ్డిని జైలులో వెయడానికేనా ప్రధాన మంత్రి ఉద్దేశమా. తెలంగాణ పౌరుషం మాలో ఉంది...భయపడేది లేదు. నిజాం,రజాకార్లకు పట్టిన గతే బిజేపికి పట్టింది.
పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి జీవన్ రెడ్డి. పదవులను అడ్డం పెట్టుకొని జీవన్ రెడ్డి ఎప్పుడూ అక్రమంగా సంపాదించలేదు. నిజామాబాదు ప్రాంతం వారికి అండగా నిలబడడానికే జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటి చేస్తున్నారు. కొడంగల్ ఓటమి నాకు లాభం తెస్తే, జీవన్ రెడ్డికి జగిత్యాల ఓటమి లాభం చేకూర్చుంది’ అని రేవంత్ పేర్కొన్నారు. రాజ్యాంగం రద్దుకు బీజేపీ చేస్తున్న కుట్రను సాయంత్రం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment