
సాక్షి, జగిత్యాల: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టుకు హాజరయ్యారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తక రచనపై నమోదైన కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు కోరుట్ల వచ్చారు.
అంతకు ముందు జగిత్యాలలో ఆయన బస చేసిన లాడ్జి వద్ద బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హోటల్‌పై దాడి చేసేందుకు యత్నించారు. దీంతో హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. అనంతరం ఐలయ్య పోలీసుల రక్షణలో కోరుట్ల వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment