
నిందితుడు మహిపాల్
కోరుట్ల: పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన ఆడబిడ్డ కేసుల పేరిట ఠాణాల వెంట తిరిగితే తమ పరువు పోతుందని అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులకు íఫిర్యాదు చేయకపోవడం ఓ నయవంచకుడికి ఆసరాగా మారింది.
పెళ్లి కాకముందు ఓ అమ్మాయిని ప్రేమపేరిట వంచించి ఆత్మహత్య కు కారకుడైన సదరు యువకుడు పెళ్లి చేసుకున్న తరువాత ఇద్దరు అమ్మాయిలకు వల వేసి వంచిం చి భార్యను దూరం చేసుకున్న ఘనుడు. నెల రో జుల క్రితం ఓ అమ్మాయికి మాయమాటలు చెప్పి మోసగించి మరోసారి తప్పించుకునే యత్నం చేయగా పోలీసులు పట్టుకున్నారు.
మాయమాటలతో..
మేడిపల్లి మండలం ఒడ్డెడు గ్రామానికి చెందిన సబ్బనవేని మహిపాల్ (30) వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. 2013 సంవత్సరంలో మహిపాల్ అదే గ్రామానికి చెందిన బాలిక(17)ను ప్రేమ పేరిట వలలో వేశాడు. పెళ్లి చే సుకుంటానని చెప్పి నమ్మించి లోబర్చుకున్నాడు.
తరువాత కొన్నాళ్లకు మాటమార్చాడు. పెళ్లి చేసుకుంటా నని చెప్పిన ప్రియుడు మాటమార్చడం భరించలేని ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. కొన్నాళ్లకు ఈ సంఘటన మరుగునపడిపోగా 2014లో మహిపాల్ వివాహం చేసుకున్నాడు.
ఆ తరువాత సంవత్సరం అదే గ్రామానికి చెందిన మరో 19 సంవత్సరాల యువతికి వల వేసి ప్రేమ పేరిట లోబర్చుకున్నాడు. ఆ సమయంలో పెద్దలకు తెలిసి పంచా యితీ జరిగింది. ఆ తరువాత కొన్నాళ్లకు గొడవ సద్దుమణిగింది. ఇద్దరు అమ్మాయిలను మహిపాల్ వంచించిన విషయం తెలియడంతో భార్య అతనికి దూరం అయింది.
మరో అమ్మాయికి వల..కేసు నమోదు
ఇద్దరు అమ్మాయిలను వంచించి భార్యకు దూరమైన మహిపాల్ మూడు నెలల క్రితం గ్రామానికి చెందిన మరో యువతికి వల వేశాడు. నెల రోజుల క్రితం సదరు యువతిని ఊరి నుంచి తీసుకెళ్లాడు. దీంతో తల్లిదండ్రులు మేడిపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు కొన్నాళ్లు మహిపాల్ కోసం గాలించి చివరికి ఆ యువతితో పాటు పట్టుకున్నారు. ఈ విషయం కోరుట్ల సీఐ సతీష్ చందర్ దృష్టికి వచ్చింది. మహిపాల్ అమ్మాయిలను వంచించి మోసగిస్తున్న వైనాన్ని తీవ్రంగా పరిగణించి అతనిపై చీటింగ్, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment