
ప్రతిజ్ఞ చేస్తున్న కులసంఘాల సభ్యులు
కథలాపూర్: టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కథలాపూర్ మండలం దుంపేటలో ఒడ్డెర కులసంఘం, గీత కార్మిక సంఘం సభ్యుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కులసంఘాలవారిగా పాల్గొని విజయవంతం చేశారని, వారి సేవలను గుర్తించి కులసంఘ భవనాలకు నిధులు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు.
ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, మాజీ సర్పంచ్ చిలుక రాజేంద్రప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ ఎం.డీ రఫీ, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment