కోరుట్లటౌన్: రానున్న ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు నష్టం ఖాయమని ఎంఐఎం కోరుట్ల అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీయోద్దీన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షులు అసద్ ఒవైసీ టీఆర్‌ఎస్‌కు మద్దతు విషయంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు ఎంఐఎం మద్ధతుందని ప్రచారం చేయడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఎంఐఎం పార్టీకి నష్టం కలిగేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.
పట్టణంలోని 10, 15 వార్డు కౌన్సిలర్ల భర్తలను మభ్యపెట్టి తన వెంట తిప్పుకుంటూ, వారిని ఎంఐఎం నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసాగర్‌రావు, ఎంఐఎం పార్టీకి నష్టం చేస్తే ఆయన సఫలం కాడన్నారు. ఇలా చేస్తే టీఆర్‌ఎస్‌కు నష్టం ఖాయమని హెచ్చరించారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సీహెచ్. భూమయ్య, ఎండీ. జహంగీర్ అహ్మద్, అబూబాకర్, నిజాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment