కోరుట్ల(కరీంనగర్ జిల్లా): కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడో భర్త. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గుర్రం వనిత, శంకర్ భార్యాభర్తలు. శుక్రవారం శంకర్ తన భార్య తలపై రాడ్డుతో బలంగా కొట్టాడు.
దీంతో తీవ్ర రక్త స్రావమై వనిత అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం భర్త శంకర్ పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భర్త చేతిలో భార్య హతం
Published Fri, Feb 3 2017 5:03 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
Advertisement
Advertisement