కరీంనగర్: మండల కేంద్రానికి చెందిన మేకల ఆర్థిక(17) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇంటర్ వరకు చదివింది. సునీత–పర్శరాములు దంపతులకు మూడో కూతురు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా శిక్షణ పొందుతోంది. తన తండ్రి పర్శరాములుకు పక్షవాతం, క్యాన్సర్ వ్యాధితో సంవత్సర కాలంగా మంచానికే పరిమితమయ్యాడు. వ్యాధిని నయం చేయించేందుకు చేతిలో డబ్బు లేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆర్థిక.. గురువారం సాయంత్రం సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తెలిపారు. శవ పంచనామా నిర్వహించి హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-
66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment