మానసికంగా కృంగిపోయి.. | - | Sakshi
Sakshi News home page

మానసికంగా కృంగిపోయి..

Published Thu, Jan 11 2024 8:02 AM | Last Updated on Thu, Jan 11 2024 11:12 AM

- - Sakshi

మౌస్మి (ఫైల్‌)

కరీంనగర్: ఆరోగ్యం సహకరించడం లేదని, ఆ స్పత్రుల్లో చూపించుకున్నా నయం కావడంలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని గోధూర్‌లో చోటుచేసుకుంది. మౌస్మి(17) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. తరచూ అనారోగ్యం బారిన పడుతున్న ఆమె చదువులో వెనుకబడుతున్నానని మానసికంగా కృంగిపోయింది.

గత నెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఉమాసాగర్‌ బుధవారం తెలిపారు. మృతురాలి తండ్రి లక్ష్మీనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ముఖ్య గమని​క: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

ఇవి చ‌ద‌వండి: ఊయలే.. ఉరితాడై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement