నువ్వులేని ఈ జీవితం మాకెందుకయ్యా... | - | Sakshi
Sakshi News home page

నువ్వులేని ఈ జీవితం మాకెందుకయ్యా వస్తున్నా...చెల్లితో కలిసి నేనూ వస్తున్నా బిడ్డా...

Published Wed, Aug 2 2023 12:14 AM | Last Updated on Wed, Aug 2 2023 11:54 AM

- - Sakshi

ఎట్టా పోతివిరా బిడ్డా ప్రతాపా మీ నాయనలాగే మమ్మల్ని వదలి అట్టెట్టా పోతివిరా ఇంట్లో దీపం వెలిగినా... అంతా చీకటేనయ్యామా జీవితాలు అంధకారమం అయ్యయయ్యా జాలిచూపే మనుషులు ఇక్కడ లేరయ్యా నీకేమైందో... ఎందుకు ఎళ్లిపోయావో ఎలా చెప్పేదయ్యా...నువ్వుంటే ధైర్యంగా ఉండేదయ్యా మా జీవితమే నువ్వైనప్పుడు... నువ్వులేని ఈ జీవితం మాకెందుకయ్యా వస్తున్నా...చెల్లితో కలిసి నేనూ వస్తున్నా బిడ్డా...

....అంటూ ఓ తల్లి ఇటీవల మృత్యువాత పడిన కుమారుడిని తలచుకుని కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

 శ్రీ సత్యసాయి: కుమారుడి మృతి జీర్ణించుకోలేక తల్లి కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి మృత్యువాత పడగా, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మండల పరిధిలోని ఇందుకూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గంగిరెడ్డి, వెంకటలక్ష్మమ్మ(55) దంపతులు. వీరికి ప్రతాప్‌రెడ్డి, పుష్పావతి సంతానం. గంగిరెడ్డి కొన్నేళ్ల క్రితమే మృత్యువాత పడగా, వెంకట లక్ష్మమ్మ కూతురు, కుమారుడే లోకంగా బతికింది.

అయితే వారం రోజుల క్రితం కుమారుడు ప్రతాప్‌రెడ్డి స్నేహితులతో కలిసి మద్యం సేవించి అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. ఆధారం అనుకున్న ఒక్కగానొక్క కుమారుడు దూరం కావడాన్ని వెంకటలక్ష్మమ్మ జీర్ణించుకోలేక పోయింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆమె కూతురు పుష్పావతితో కలిసి ఊజిమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన ఇరుగూ పొరుగు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, వెంకటలక్ష్మమ్మ మృత్యువాత పడింది. కూతురు పుష్పావతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement