
సంఘటనాస్థలంలో వివరాలు సేకరిస్తున్న కర్ణాటక పోలీసులు
ప్రేమ విఫలం కావడంతో ప్రేమికులు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కనకపుర తాలూకాలో చోటుచేసుకుంది.
దొడ్డబళ్లాపురం: ప్రేమ విఫలం కావడంతో ప్రేమికులు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కనకపుర తాలూకాలో చోటుచేసుకుంది. కనకపుర తాలూకా చాముండిపుర గ్రామానికి చెందిన ప్రేమికులు తమిళనాడు సమీపంలోని కావేరి నది ప్రవాహంలో హొగేనకల్ జలపాతం వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా యువకుడు ఉమేశ్ (24) మృతిచెందగా, ప్రియురాలు (17)ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.
ఉమేశ్, పీయూసీ ఫస్టియర్ చదువుతున్న గిరిజన మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. విషయం తెలిసి పెద్దలు వ్యతిరేకించడంతో ఆగస్టు 9వ తేదీన ఇద్దరూ కనబడకుండా పోయారు. దీంతో వారు కోడిహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హొగేనకల్ ఫాల్స్ వద్ద ప్రేమికులు విషంతాగి ఆత్మహత్యాయత్నం చేశారని తెలిసి పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే ఉమేశ్ చనిపోయి ఉన్నాడు. అస్వస్థతకు గురైన బాలికకు ధర్మపురి ఆస్పత్రిలో చికిత్స అందించిన తరువాత బెంగళూరు కెంపేగౌడ ఆస్పత్రికి తరలించారు.