కర్ణాటక: పాఠశాలకు వెళుతున్న బాలికను ప్రతిరోజు యువకుడు వేధిస్తుండటంతో ఆవేదనకు లోనైన బాలిక ఉరి వేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన మైసూరు తాలూకాలోని బంచహళ్ళిహుండి గ్రామంలో జరిగింది. వివరాలు.. రమేష్ కుమార్తె చందన (15) పాండవపుర ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు శరత్ ఈ బాలిక వెంటపడుతూ ప్రేమ పేరిట వేధించేవాడు.
పాఠశాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు వెంటాడి పీడించడంతో బాలిక భయపడిపోయింది. తండ్రికి ఈ విషయం చెప్పగా ఆ పోకిరీని మందలించారు. అయినా కూడా దుండగునిలో మార్పు రాలేదు. అతని వేధింపులను తట్టుకోలేని బాలిక శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నంజనగూడు గ్రామీణ పోలిసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment