వేతనాలు చెల్లించాలని ముగ్గురు కార్మికుల ఆత్మహత్యాయత్నం | Three workers attempted suicide to pay wages | Sakshi
Sakshi News home page

వేతనాలు చెల్లించాలని ముగ్గురు కార్మికుల ఆత్మహత్యాయత్నం

Published Sat, Oct 14 2023 12:38 AM | Last Updated on Sat, Oct 14 2023 12:38 AM

Three workers attempted suicide to pay wages - Sakshi

ఎంజీఎం: వేతనాలు చెల్లించాలని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు పురుగు మందు తాగారు. ఎంజీఎం ఆస్పత్రికి 20 నెలల కిందట 300 ఓసీఎస్‌ పద్దు కింద 35 పోస్టులు మంజూర య్యాయి. వీరిని ఔట్‌సోర్సింగ్‌ కింద తీసుకున్నారు. అయితే 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో 16 మంది కార్మికులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం చు ట్టూ రెండు, మూడు రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నారు. శుక్రవారం సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌తో కార్మికులు చర్చలు జరిపి వేతనాలు చెల్లించాలని కోరారు.

ఈ క్రమంలో 300 ఓసీఎస్‌ పద్దులో కాకుండా ఎంజీఎం ఆస్పత్రిలో కృష్ణ కన్‌స్ట్రక్షన్‌ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లిస్తామని చెప్ప డంతో ఆవేదనకు గురై న కార్మికుల్లో ముగ్గురు ఆయన చాంబర్‌ ఎదుట పురుగు మందు తాగారు. వెంటనే సిబ్బంది వారిని చికి త్స నిమిత్తం ఆస్పత్రి  అత్యవసర విభాగానికి తరలించారు. కాగా, ఈ ఘటనపై సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వీరి వేతనాల సమస్య సచివాలయంలో పెండింగ్‌ ఉందని తెలిపారు. బెదిరించే ధోరణిలో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement