
సాక్షి, విజయనగరం: జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల్లీకొడుకుల సెల్పీ సూసైడ్‌యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా, వీరి ఆత్మహత్యకు కొడుకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. యూసిన్ అనే యువకుడు పార్వతీపురానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ తాజాగా వారి మధ్య విబేధాలు నెలకొన్నాయి. దీంతో, ఆమెతో దూరంగా ఉంటున్నాడు యాసిన్. అయితే, సదరు యువకుడిని ఆమె బంధువులు వేధింపులకు గురిచేయడంతో పాటుగా బెదిరించారు. అతనిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ ఘోరంగా అవమానించారు. తన తల్లి గురించి కూడా దారుణమైన కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో వారి బెదిరింపులు, వేధింపుల కారణంగా యాసిన్, అతడి తల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు తల్లీ కొడుకు పురుగుల మందు తాగారు. ఈ సందర్బంగా తమ ఆత్మహత్యలకు సదరు యువతి కుటంబమే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుంటూ సూసైడ్‌యత్నం చేశారు. విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించడంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్ చేసి..