Love Problems
-
సారీ కవిత నా వల్ల మాటలు పడ్డావ్.. తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయనగరం: జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల్లీకొడుకుల సెల్పీ సూసైడ్‌యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా, వీరి ఆత్మహత్యకు కొడుకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. యూసిన్ అనే యువకుడు పార్వతీపురానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ తాజాగా వారి మధ్య విబేధాలు నెలకొన్నాయి. దీంతో, ఆమెతో దూరంగా ఉంటున్నాడు యాసిన్. అయితే, సదరు యువకుడిని ఆమె బంధువులు వేధింపులకు గురిచేయడంతో పాటుగా బెదిరించారు. అతనిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ ఘోరంగా అవమానించారు. తన తల్లి గురించి కూడా దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో వారి బెదిరింపులు, వేధింపుల కారణంగా యాసిన్, అతడి తల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు తల్లీ కొడుకు పురుగుల మందు తాగారు. ఈ సందర్బంగా తమ ఆత్మహత్యలకు సదరు యువతి కుటంబమే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుంటూ సూసైడ్‌యత్నం చేశారు. విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించడంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్ చేసి.. -
క్షణికావేశం.. కలవరపెడుతున్న ప్రేమికుల ఆత్మహత్యలు
సుల్తానాబాద్ మండలం కనుకులకు చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. పెద్దలు నిరాకరించడంతో అబ్బాయి పురుగుల మందు తాగి సోమవారం మృతిచెందగా.. అమ్మాయి మంగళవారం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోదావరిఖని ప్రాంతానికి చెందిన 25ఏళ్ల యువకుడు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. సాక్షి, పెద్దపల్లి: ‘తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష’ అనే సామెతను మరిచి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతూ కుటుంబాలను విషాదంలో ముంచుతున్నారు కొందరు. సమస్యను ఇతరులతో పంచుకోకుండా.. పరిష్కారం కనుక్కోకుండా విలువైన ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రేమలో వైఫల్యం, కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, సాగులో నష్టం, దీర్ఘకాలిక రోగాలు, క్షణికావేశం, మనస్పర్థలు, మానసిక సమస్యలతో లోకం విడిచి వెళ్లిపోతున్నారు. సమస్యలు అధిగమించలేక రకరకాల కారణాలతో జిల్లాలో ఏదో ఒకచోట ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 15 నుంచి 35 ఏళ్లలోపు యువత, మహిళలలే ఎక్కువగా ఉంటున్నారు. కన్నవారికి గుండెకోత.. సుల్తానాబాద్ రూరల్: మండలంలోని కనుకులకు చెందిన మైనర్లు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి గుండెకోత మిగిల్చారు. ఇరుకుటుంబాల్లో తీరని శోకాన్ని కలిగించారు. ఇద్దరిదీ తెలిసీ తెలియని వయసు కావడం.. ప్రేమలో ఉన్నామని భ్రమపడి.. పెద్దలు ఎంత చెప్పినా వినకుండా ప్రాణాలు తీసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ అబ్బాయి తొమ్మిదో తరగతి వరకు చదువుకుని ఇంటివద్దనే ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి చనిపోవడంతో తల్లి అన్నీతానై పోషిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ కొడుకును అల్లారుముద్దుగా చూసుకుంటోంది. ఇంతలోనే ప్రేమ పేరిట అఘాయిత్యానికి పాల్పడడం ఆమెకు తీరని వేదన కలిగిస్తోంది. అదే గ్రామానికి చెందిన అమ్మాయి కూడా పదో తరగతి వరకు చదువుకుని ఇంటివద్దనే ఉంటోంది. వారి ఇద్దరి ఇళ్లు సమీపంలోనే ఉండడంతో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నా.. కులం అడ్డురావడం.. పెద్దలు అంగీకరించకపోవడంతో ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు తీసుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఇలాంటి వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతారు ► ఆత్మవిశ్వాసం కోల్పోయిన వ్యక్తులు.. ► చదువులో వెనుకబడి.. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చలేకపోతున్నామనుకునేవారు. ► మత్తుపదార్థాలకు అలవాటుపడిన వ్యక్తులు.. ► సమాజంలో పరువు పోతుందని, ఎదుటివారు తప్పుగా మాట్లాడతారనుకునేవారు. ► కుటుంబం, ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య నమ్మకం లేని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారు. ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే.. ► ఒకచోట కుదురుగా ఉండకుండా అటూఇటూ తిరుగుతుండటం.. ► ఏ పని మీదా ఆసక్తి చూపకపోవడం.. చేసే పనిమీద ఆసక్తి లేకపోవడం.. ► ప్రతి చిన్న విషయానికీ ఎదుటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. ► చీకటిలో ఎక్కువ సమయం గడపడం.. దిగాలుగా, దుఃఖంతో ఉండటం.. ► ఎవరిని కలువకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడటం.. అనుకున్నది సాధించలేకపోయామనే నిర్వేదం.. ► జీవించడం ద్వారా ఎవరికీ ఉపయోగం లేదనుకోవడం.. వంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులను అనుమానించాలి. సంకేతాల్ని గుర్తించాలి ఎవరూ ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా ఆత్మహత్యలకు పాల్పడరు. వారి ప్రవర్తన, మాటల ద్వారా తమ ఆలోచనల్ని వ్యక్తీకరిస్తారు. వీటిని సైకాలజీలో ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలుగా చెబుతారు. ఈ సంకేతాలపై అవగాహన ఉంటే ఆత్మహత్య ఆలోచన ఉన్నవారిని గుర్తించి కాపాడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థులు వీటిపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. – కె.రామచంద్రం, సైకాలజీ కేయూ సదస్సులు నిర్వహిస్తాం ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. కోపం దరిచేరనివ్వకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే స మస్యలు దూరమవుతాయి. విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పితే అర్ధాంతరంగా ముగించడం తగదు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గ్రామాల్లో మండల లీ గల్ సర్వీస్ అథారటీల ద్వారా న్యాయ, విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తాం. కేసులు రాజీ చేసుకునేలా లోక్ అదాలత్ ద్వారా ప్రోత్సహిస్తున్నాం. – సురేష్‌బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, పెద్దపల్లి ఆత్మహత్యలు పరిష్కారం కాదు సమస్యలకు ఆత్మహత్యలు ప రిష్కారం కాదు. విపరీతమైన ఒ త్తిడి, కోపం, అసహనంలో పుట్టిన నిరాశ, నిస్పృహల ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. కు టుంబ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మెరుగు పర్చుకోవటం ద్వారా జీవితానికి భరోసా కలుగజే యవచ్చు. ఆ దిశగా స్నేహితులు, బంధువులు భరోసా ఇవ్వాలి. – పి.రవీందర్, డీసీపీ ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని.. యువకుడు ఎంత పని చేశాడంటే..
సాక్షి, ప్యాపిలి( కర్నూలు): ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రేయసి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్యాపిలిలో చోటుచేసుకుంది. పట్టణంలోని సేసేపేటలో నివాసం ఉంటున్న మాసాని ప్రసాద్, వరలక్ష్మి దంపతుల కుమారుడు శివశంకర్ (26) మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బీటెక్ చదివిన శివశంకర్ పట్టణ సమీపంలోని అరుణాచల ట్రాన్స్‌పోర్టులో పని చేస్తున్నాడు. కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్న శివశంకర్ తరచూ ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు వారి వివాహానికి అంగీకరించారు. అయితే ప్రేమించిన ప్రేయసి మాత్రం పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. మృతుడి తండ్రి ప్రసాద్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెల వివాహం కాగా, తల్లి కుమారుడిపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తూ వచ్చింది. చేతికి వచ్చిన కుమారుడు విగతజీవిగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నాగరాజు తెలిపారు. -
చిన్నలింగాపూర్‌లో ప్రేమ పంచాయితీ
సిరిసిల్లరూరల్: తంగళ్లపల్లి చిన్నలింగపూర్లో ఓ ప్రేమ పంచాయితీ బుధవారం ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ప్రియుడిపై ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రియుడు పురుగుల మందుతాగాడు. ఈ సంఘటన చిన్నలింగాపూర్‌లో కలకలం సృష్టించింది. తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామానికి చెందిన వర్కాల మహేశ్ తనను ప్రేమించి మోసం చేశాడని ఇదే గ్రామానికి చెందిన బొడపట్ల పల్లవి రెండ్రోజుల క్రితం ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. పెద్దలు సముదాయించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించింది. బుధవారం ప్రేమ పంచాయితీని చిన్నలింగాపూర్‌లో పెద్దల సమక్షంలో నిర్వహించారు. పెళ్లికి మహేశ్ నిరాకరించడంతో యువతి తరఫు బంధువులు మహేశ్‌పై దాడి చేశారు. పోలీసులు వచ్చి గొడవను అదుపులోకి తెచ్చారు. అవమానంగా భావించిన మహేశ్ పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మహేశ్‌పై చర్య తీసుకోవాలని పల్లవి తంగళ్లపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై మారుతి కేసు నమోదు చేశారు. -
ప్రాణంతీసిన ఇష్టంలేని పెళ్లి..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తల్లిదండ్రుల బలవంతపు పెళ్లి ఓ యువతి ప్రాణాలు తీసింది. ప్రేమించిన యువకున్ని కాదని మరో వివాహం జరిపించగా..ఇష్టంలేని వ్యక్తితో కాపురం చేయలేక ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన వీర్నపల్లి మండలం కంచర్లలో విషాదం నింపింది. ఎస్సై ఎంవీ.సురేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన అజ్మీరా అంగురి (20) ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమించింది. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు కామారెడ్డి జిల్లా ముత్కేడు గ్రామానికి చెందిన సంతోష్‌తో ఏడు నెలలక్రితం వివాహం జరిపించారు. సంతోష్‌ను ఇల్లరికం తీసుకొచ్చుకున్నారు. మూడు నెలలకు అంగురి ప్రేమ విషయం భర్తకు తెలిసింది. దీంతో నాలుగు నెలలక్రితం సంతోష్ తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో పరిస్థితిని అంచనా వేసిన ప్రేమికుడు 20రోజులక్రితం గల్ఫ్ వెళ్లిపోయాడు. అటు భర్తతో ఎడబాటు.. ఇటు ప్రేమికుడు దూరం కావడంతో శుక్రవారం అంగురి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. చుట్టప్రక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. ఎస్సై కేసు నమోదు చేశారు. -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రిటర్న్స్ సార్... మీరు లేకపోతే లేకపోయారు. మా నీలాంబరినైనా సమాధానం చెప్పమనండి. ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు ప్రాక్టీస్ మానేసి! ఇంచుమించు 1800 డేస్. నా లవ్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరకడం లేదు. ఓ అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తున్నాను సార్. మీరు మానేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మాయిని ఫాలో అవుతున్నాను. రోజూ ట్రై చేస్తున్నా అస్సలు పట్టించుకోవడం లేదు. నిద్రలేదు. ఆకలి లేదు. చదువు లేదు. మీకు దండం పెడతాను. ఏం చెయ్యమంటారో నీలాంబరితోనైనా చెప్పించండి డాక్టర్... ప్లీజ్. – సురేశ్, చిత్తూరు కిటికీలోంచి బయటికి చూస్తోంది నర్సు నీలాంబరి... లవ్ ప్రాబ్లమ్‌లు పట్టనట్టు, నన్ను పట్టించుకోనట్టు. ‘సో మెనీ డేస్... వేర్ డిడ్ యు గో’ అన్నట్టు. ఈ సమ్మర్ టైమ్‌లో వీధిలో చూడ్డానికి ఏముంటుందని! నాజూగ్గా... గాలి రాకుండా నాకు అడ్డం నిలబడడం తప్ప. ఉక్కబోస్తోంది. నా అనుమానం ఏంటంటే ఈ ఉత్తరం అసలు ఒక లవర్ దగ్గరి నుంచి కాకుండా... నీలాంబరి రాసి పోస్ట్ చేసి ఉంటుందని! నన్ను ఎలాగైనా వెనక్కి రప్పించేసి, ఈ లవ్ ప్రాబ్లమ్లలో నన్ను కుక్కేసి, ఆమె లవ్ నర్స్‌గా ఎక్కేయాలని చేసిన సర్జికల్ స్ట్రయిక్‌గా అనిపించింది. ‘‘హలో... నీలాంబరీ... ఒక అరటిపండు ఉందా?’’ అని అడిగా. ‘‘ఫైవ్ ఇయర్స్ బ్యాక్ది ఉంది. తింటారా?’’ అంది!‘‘ఆ ఉత్తరం రాసినవాడి ప్రేమలాగే ఉంటుంది. కుళ్లిపోయి, ఎండిపోయి, కంపుకొడుతూ. ఏదో జూనియర్ ఎన్టీఆర్ అంటే అనుకోవచ్చు. ఫాలో... ఫాలో... ఫాలో... ఫాలో... ఫాలో... అని నాలుగైదుసార్లు అంటే హీరోయినే కాదు, ఆడియన్స్ కూడా ఫాలో అవుతారు. ఫైవ్ ఇయర్స్... ఈ లవ్ ప్రాబ్లమ్స్ భరించలేక అరటితోట సాగు చేసుకుంటున్నా. కరవొచ్చి, నీళ్లు లేక, సేద్యానికి సర్వమంగళం పాడి, ఇక లాభం లేదు... నాలుగు సమాధానాలు వెనకేసుకుందామని వెనక్కి వచ్చేశా. నువ్వు బెట్టు చెయ్యకుండా ఒక్క ఫ్రెష్ అరటిపండు ఇవ్వు నీలాంబరీ. అదే చేత్తో ఆ లవర్ బాయ్‌కి కూడా ఒక అరటిగెల పంపించు. అరటిపండును ప్రేమించడం మొదలుపెడితే పండు లాంటి కెరియర్ మీద శ్రద్ధ పెరుగుతుంది. అమ్మాయిల మీద ధ్యాస తగ్గుతుంది. ఏమంటావు నీలాంబరీ’’ అన్నాను. ‘‘అరటితోట వర్కవుట్ కాక, మీరు అరటిపండు దగ్గరికి వచ్చారు. అలాగే లవర్ బాయ్‌కి లవ్వు వర్కవుట్ కాలేదు కాబట్టి అరటిగెల పంపిస్తున్నారు’’ అంటూ ఫక్కున నవ్వింది నీలాంబరి. ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
తాళ్లపూడి: పెద్దేవం గ్రామంలో బుధవారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పెద్దేవానికి చెందిన తాటిపాక మనోజ్(18) ఎలక్ట్రీషియన్‌గా తాడిపూడి గ్రామ పంచాయతీతో పాటు పలుచోట్ల పని చేస్తున్నాడు. అతనికి గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో ప్రేమ వ్యవహరం ఉంది. ఈ విషయం తెలిసి గతంలో మనోజ్‌ను ఆ బాలిక బంధువులు మందలించారు. ఈ క్రమంలో బుధవారం బాలిక ఇంట్లోని బెడ్రూంలో మంచంపై అతను విగత జీవిగా కనిపించాడు. ఈ విషయం తెలిసి మనోజ్ కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతిపై అనుమానాలు మనోజ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి తల్లి వెంకటలక్ష్మి, తండ్రి వెంకటరావు మాత్రం తన కొడుకుని కావాలనే తీసుకెళ్లి చంపేసారని ఆరోపించారు. మంగళవారం రాత్రి సుమారు 7 గంటలకు ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని ఇప్పుడు ఇలా ఆ అమ్మాయి ఇంట్లో శవమై పడిఉన్నాడని విలపించారు. మంగళవారం రాత్రి చనిపోతే మధ్యాహ్నం వరకు ఆ విషయాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించారు. గతంలో ఓ సారి ఆ బాలిక బంధువులు తమ ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించారని. అతని ఒంటిపైన, ముఖం మీద దెబ్బలు ఉన్నాయని ఇది హత్యే అన్నారు. పథకం ప్రకారం తమ కుమారుడిని చంపేశార న్నారు. తమ కుటుంబానికి ఏకైక ఆసరా అయిన కుమారుడు లేకుండా పోయాడని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాకేమీ తెలీదు : బాలిక మంగళవారం రాత్రి తన ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని, తనకు ఏమీ తెలియదని ఆ బాలిక చెబుతోంది. పక్కగదిలో కుటుంబ సభ్యులు ఉన్నారని, ఆమె తండ్రి రాజమండ్రి ఆసుపత్రి పనిమీద వెళ్లారని చెబుతున్నారు. పోలీసులు, సీఐ వివరాలు సేకరించారు. సీఐ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసును ఛేదిస్తామన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. -
నన్నడగద్దు ప్లీజ్..!
ప్రియదర్శిని రామ్, లవ్ డాక్టర్ మీకో తిక్కుంది. లవ్ డాక్టర్కో లెక్కుంది. మీ తిక్క మీ ప్రేమ ప్రాబ్లమ్స్! మరి లవ్డాక్టర్కో... యధార్థ సంఘటన ఒక రోజు అర్ధరాత్రి.. యాక్చువల్లీ అపరాత్రి. టైమ్ పన్నెండుకు అటూ ఇటూ! ఎటో మరి. ఉబుసుపోక క్లినిక్‌కి వెళదామని ఇంటినుంచి బయల్దేరాను. పై అంతస్తులో ఉన్న క్లినిక్‌కు చేరుకోవడానికి అటూ ఇటూ ఎటో చూస్తున్నాను. అటుగా వె ళుతున్న ఓ వ్యక్తి దగ్గరగా వచ్చాడు. అనుమానంగా చూస్తూ ‘‘మీరు... లవ్ డాక్టర్ కదా!’’ ఆశ్చర్యంగా, అబ్బురంగా, ఆసక్తిగా...గా.. గా..గా...అడిగాడు. ‘‘అవును’’అన్నాను. ‘‘మీరు చాలా బాగా రాస్తారు సర్!’’ అన్నాడతను. ‘‘ఎందుకులెండి బాబూ!’’ అన్నాను మరీ మొహమాటపడిపోతూ! ‘‘నిజం సార్! మీరు చెప్పిన మాటలకు ఎంత బలం ఉంటుందంటే, అవి జీవితాలను నిలబెడతాయ్!’’ అన్నాడతను. ‘ఓర్నాయనో... ఈ మనిషి మరీ మోసేస్తున్నాడు’ అనుకుంటుండగా ఆ వ్యక్తి ‘‘సార్ మీకు గుర్తుందా! ఒకమ్మాయి మీకో ఉత్తరం రాసింది. ప్రేమను పొందలేక ఆత్మహత్య చేసుకుంటాను... అని...’’ (నా ముఖం బ్లాంక్‌గా అయ్యింది) ‘‘అంతేలెండి సార్, మీకు ఎంతోమంది ఉత్తరాలు రాస్తుంటారు. ఎవర్నని గుర్తుపెట్టుకుంటారు’’ అన్నాడతనే. ‘‘ఇంతకీ సమాధానం ఇచ్చానా?’’ అనుమానంగా అడిగాను. ‘‘ఇచ్చార్సార్!’’ అంటూనే ‘‘ఆ అమ్మాయి ఎవరో తెలుసా సార్ మీకు.’’ (నాది మళ్లీ బ్లాంక్ ఫేస్). ‘‘ఆ అమ్మాయి ఇప్పుడు నా భార్య సార్!’’ అన్నాడతను. షాక్ అయ్యాను. మనసులో ‘అయ్యో! వీణ్ణి చేసుకోవాలని డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకుందా ఏమిటి? అందుకే అప్పుడు ఉత్తరం రాసుంటుందా! పాపం’ అనుకుంటూ భయం భయంగా ‘‘అదెలా జరిగింది?’’ అన్నాను. ‘‘మేమిద్దరం ప్రేమించుకున్నాం సర్! పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. ఏ నిర్ణయం తీసుకోలేక ‘చనిపోవాలనుకుంటున్నాం..’ అని మీకు లెటర్ రాసింది తను. మీరు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం మేం మా ఇద్దరి తల్లిదండ్రులకు చూపించాం. వారు రియలైజ్ అయ్యారు. ఇదే కరెక్ట్ అని మాకు పెళ్లి చేశారు. మీ దయవల్ల మేం ఒకింటివారమయ్యాం...’’ అతను అంటుండగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యింది. నీలాంబరి అరటిపండు పట్టుకొని ఉంది. ఆయన హ్యాండ్‌ని షేక్ చేయాలా? నీలాంబరి చేతిలోని అరటిపండు టేక్ చేయాలా? అని బుర్ర బేక్ అవుతున్న టైమ్‌లో నీలాంబరి చెప్పింది ‘‘ఏంటోసార్! మళ్లీ ఉత్తరాలకు మీరే సమాధానాలు రాయాలట. ‘సాక్షి’ నుంచి ఇప్పుడే కబురొచ్చింది. కబురుతో పాటు డజను అరటిపండ్లు కూడా పంపించార్సార్! అయినా... మీ తొక్కలో సమాధానాలకి డజను అరటిపండ్లా సార్!’’ అని ఆ సంసారి ముందు నన్ను సన్నాసిని చేసింది. సరదాగా కాసేపు పిల్లలతో మాట్లాడుతూ మంచి విషయం చె ప్పినా చెప్పకపోయినా కలుపుగోలుగా ఉంటే జీవితంలోని ఆశలు ఆశయాలుగా మారుతాయని మొదలుపెట్టిన ‘లవ్‌డాక్టర్’ కాలమ్ అందరికీ ఉపయోగపడింది. అందుకే మళ్లీ వస్తున్నాడు మీ లవ్ డాక్టర్. మీరు రాసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా మిమ్మల్ని చిరాకు పెట్టిన లవ్డాక్టర్కు ‘మీ కాలమ్ మొద లు పెడుతున్నాం’ అని చెప్పినప్పటి నుంచి కాలు కాలిన పిల్లిలా తలుపుదగ్గరకు వెళుతున్నాడు.. వస్తున్నాడు. నీలాంబరిని ఉత్తరాలు వచ్చాయా? అని అడుగుతున్నాడు. పోస్ట్‌మేన్ బాషా, కొరియర్ అరుణాచలం, స్పీడ్‌పోస్ట్ ముత్తు... కోసం పడిగాపులు కాస్తున్నాడు. నర్స్ నీలాంబరి ఈయన అగచాట్లు చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటోంది. అప్పుడు వంకరటింకర సమాధానాలిచ్చి మిమ్మల్ని ఆటపట్టించినందుకు మీకిదే ‘రివెంజ్’ తీసుకునే బెస్ట్ ఛాన్స్! ‘నన్ను అడగద్దు ప్లీజ్’ కాలమ్‌కి ఒక్క ఉత్తరం కూడా రాయకండి. చెప్పులు అరిగి బుర్ర వేడెక్కి కడుపుతిప్పి ‘లవ్‌డాక్టర్’ పేషెంట్ అయిపోవడం ఖాయం. మీరు తొందరపడి ఉత్తరం రాయకూడని అడ్రస్... లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034, మెయిల్: sakshi.lovedoctor@gmail.com https://www.facebook.com/sakshifamily