చిన్నలింగాపూర్‌లో ప్రేమ పంచాయితీ | Lover Suicide Attempt In Karimnagar | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటిఎదుట ప్రియురాలు బైఠాయింపు

Published Thu, Jul 5 2018 11:35 AM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

Lover Suicide Attempt In Karimnagar - Sakshi

చికిత్స పొందుతున్న మహేశ్‌

సిరిసిల్లరూరల్‌: తంగళ్లపల్లి చిన్నలింగపూర్‌లో ఓ ప్రేమ పంచాయితీ బుధవారం ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ప్రియుడిపై ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రియుడు పురుగుల మందుతాగాడు. ఈ సంఘటన చిన్నలింగాపూర్‌లో కలకలం సృష్టించింది. తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌ గ్రామానికి చెందిన వర్కాల మహేశ్‌ తనను ప్రేమించి మోసం చేశాడని ఇదే గ్రామానికి చెందిన బొడపట్ల పల్లవి రెండ్రోజుల క్రితం ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది.

పెద్దలు సముదాయించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించింది. బుధవారం ప్రేమ పంచాయితీని చిన్నలింగాపూర్‌లో పెద్దల సమక్షంలో నిర్వహించారు. పెళ్లికి మహేశ్‌ నిరాకరించడంతో యువతి తరఫు బంధువులు మహేశ్‌పై దాడి చేశారు. పోలీసులు వచ్చి గొడవను అదుపులోకి తెచ్చారు. అవమానంగా భావించిన మహేశ్‌ పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మహేశ్‌పై చర్య తీసుకోవాలని పల్లవి తంగళ్లపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై మారుతి కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement