యువకుడి ఆత్మహత్యాయత్నం
చోరీ కేసులో కీలక పాత్ర
నిందితులు తప్పించుకోవడంలో సహాయం
డబ్బులు చెల్లించాలని యజమాని ఒత్తిడి
జీడిమెట్ల: దొంగతనంలో కీలక పాత్ర పోషించాడు.. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.. ఇంటి యజమానితో మంచిగా ఉంటూనే దొంగతనం చేసిన వ్యక్తికి పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాడు. తీరా పోలీసులకు అసలు విషయం తెలిసిపోవడంతో పరువు పోయిందని ఓ వైపు, డబ్బులు కట్టాలంటూ యజమాని ఒత్తిడి చేయడంతో ఓ యువకుడు ఉరి వేసుకుని అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. వివరాల్లోకి వెళితే రాజస్ధాన్‌కు చెందిన హనుమాన్‌రాం కుత్బుల్లాపూర్ విలేజ్‌లో స్టీల్ సామాన్ల దుకాణం నిర్వహిస్తున్నాడు.
ఈనెల 3న అతడి ఇంట్లో రూ.14లక్షలు చోరీకి గురయ్యాయి. డూప్లికేట్ కీతో బీరువా తెరిచి చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. దీంతో అతను తన దుకాణంలో పనిచేసే కిషన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కిషన్, రాంలాల్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. గుర్తించారు. దీంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బాధితుడు హనుమాన్‌రాంతో పాటు అతడిని పనికి కుదిర్చిన అశోక్‌తో సహా రాజస్థాన్ బయలుదేరారు.
ఈ క్రమంలో అశోక్ పోలీసుల కదలికలపై కిషన్, రాంలాల్‌లకు ఎప్పటికప్పుడు వాట్సప్ కాల్స్, మేసేజ్‌ల ద్వారా సమాచారాన్ని అందించాడు. దీంతో అప్రమత్తమైన వారు అక్కడి నుంచి పరారయ్యారు. కిషన్ తల్లిదండ్రుల ద్వారా కిషన్‌ను ఇంటికి రప్పించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చారు కాగా రాంలాల్ పరారీలో ఉన్నాడు. కిష నుంచి రూ.2.70లక్షలు స్వా«దీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
విషమంగా అశోక్ ఆరోగ్యం...
అశోక్‌కు తెలిసే ఈ చోరీ జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో బాధితుడు హనుమాన్‌రాం కిషన్‌ను పనిలో కుదిర్చినందుకు చోరీకి గురైన సొమ్ము కట్టాలంటూ అశోక్‌పై ఒత్తిడి చేశాడు. దీంతో ఆందోళనకు గురైన అశోక్ ఆదివారం ఉదయం జేకేనగర్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు.దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని అజూదా అస్పత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా అశోక్ కుటుంబ సభ్యులు అత్మహత్యాయత్నానికి కారణం హనుమాన్‌రాం అని పేర్కొంటూ పేట్‌బïÙరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడమేగా గాక తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు.
అశోక్‌ను ఇంటరాగేట్ చేయలేదు
ఈ విషయమై ఇన్‌స్పెక్టర్ మల్లేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా అశోక్‌ను పోలీసులు కొట్టినందునే అతను అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వచి్చన కథనాలు పచ్చి అబద్ధమన్నారు. అనుమానం ఉంటే పోలీస్‌స్టేషన్‌లోని సీసీ పుటేజీలు పరిశీలించుకోవచ్చునని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment