మహిళా కానిస్టేబుల్‌తో పోలీసు ప్రేమాయణం.. వివాహేతర బంధం చివరకు.. | - | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుల్‌తో పోలీసు ప్రేమాయణం.. వివాహేతర బంధం చివరకు..

Published Sat, Sep 23 2023 12:36 AM | Last Updated on Sat, Sep 23 2023 8:56 AM

- - Sakshi

వివాహేతర సంబంధం ఇద్దరు పోలీసులను బలిగొంది. తనను విస్మరిస్తున్నాడన్న ఆగ్రహంతో ప్రియుడైన పోలీసుపై ఆగ్రహంతో మహిళా కానిస్టేబుల్‌ తన ఇద్దరు పిల్లలతో బలవన్మరణానికి పాల్పడింది.

సాక్షి, చైన్నె : వివాహేతర సంబంధం ఇద్దరు పోలీసులను బలిగొంది. తనను విస్మరిస్తున్నాడన్న ఆగ్రహంతో ప్రియుడైన పోలీసుపై ఆగ్రహంతో మహిళా కానిస్టేబుల్‌ తన ఇద్దరు పిల్లలతో బలవన్మరణానికి పాల్పడింది. విచారణకు భయపడి ఆ పోలీసు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మదురై సమీపంలోని తిరుపాలైకు చెందిన సుబ్బురాజ్‌ (40)కు తూత్తుకుడికి విలాతి కులం చెందిన జయలక్ష్మి(37)తో వివాహమైంది.

వీరికి పవిత్ర(11), కాళి ముత్తు(9) పిల్లలు. జయలక్ష్మి మదురైలో రైల్వేలో పోలీసుగా పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న కానిస్టేబుల్‌ చొక్కలింగం(47)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసి జయలక్ష్మికి సుబ్బురాజ్‌ విడాకులు ఇచ్చేశాడు. చొక్కలింగం భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా ఆరు సంవత్సరాలుగా జయలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.

ఈ క్రమంలో జయలక్ష్మిని తిరుచ్చికి, చొక్కలింగంను సెంగోట్టైకి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. సెంగోట్టైకి వెళ్లిన తర్వాత చొక్కలింగం ముఖం చాటేశాడు. దీంతో మనస్తాపానికి గురైన జయలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం సాయంత్రం మదురై– తిరుచ్చి ఇంటర్‌ సిటీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో చొక్కలింగం చైన్నె – తిరుచెందూరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement