Dhanapala Priyanka Commits Suicide At YSR District Due To Stomuch Pain - Sakshi
Sakshi News home page

విషాదం: ప్రియాంక ఆత్మహత్య

Published Sun, Jul 16 2023 6:11 PM | Last Updated on Sun, Jul 16 2023 6:48 PM

Dhanapala Priyanka Suicide At YSR District Due To Stomuch Pain - Sakshi

సాక్షి, మైదుకూరు: కడుపు నొప్పి భరించలేక సచివాలయ ఉద్యోగి ధనపాల ప్రియాంక (27) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన వైఎస్సార్‌జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి యుగంధర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 

మైదుకూరు మండలం నంద్యాలంపేట –2లో మైదుకూరుకు చెందిన ధనపాల ప్రియాంక (27) అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె కొన్నాళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో కడుపు నొప్పి ఎక్కువ కావడంతో మూడు రోజుల కిందట విషం తాగింది. అది గమనించిన వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందింది. ఇక, జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రసన్న ప్రియాంక మృతదేహాన్ని పరిశీలించి, ఆమె తండ్రి యుగంధర్‌ను పరామర్శించారు.

ఇది కూడా చదవండి: ఆర్కే బీచ్‌: దీపక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement