
మంచిర్యాలక్రైం: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అశోక్‌రోడ్‌కు చెందిన మహ్మద్ ఖాసీం కుమారుడు సల్మాన్ (30) స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అశోక్‌రోడ్ రోడ్‌లోనే ఉంటున్న ఓ మహిళతో కొంతకాలం చనువుగా ఉన్నాడు.
ఆ తర్వాత సదరు మహిళ కాదనడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 22న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండులో పురుగుల మందు తాగాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని వాయిస్ రికార్డ్ చేసి వాట్సాప్ ద్వారా బంధువులకు సమాచారం అందించాడు. గమనించిన స్థానికులు 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. మృతుని సోదరుడు ఎండీ రఫీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై స్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment