తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో గురువారం రాత్రి తల్లీ, కుమారుడు ఆత్మహత్య కేసులో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఘటనలో కుమార్తె తీవ్రంగా గాయపడి విజయవాడలో చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందులా? లేక కుటుంబ కలహాల వల్ల ఈ తీవ్ర నిర్ణయానికి పాల్పడ్డారా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు త్రిభువన్ చదువులో ముందు వరుసలో ఉండేవాడు. కుటుంబం కలిసిమెలిసి ఉండేదని.. ఇంతటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని చుట్టుపక్కల వారు అంటున్నారు.
గురువారం రాత్రి శ్రీదేవి సత్యప్రభ (38), పిల్లలు త్రిభువన్ (18), అమృత (16)లు గురువారం రాత్రి ఆత్మహత్యా యత్నం చేసిన సంగతి తెలిసిందే.. క్షణికావేశంలో సత్యప్రభ తీసుకున్న నిర్ణయానికి బిడ్డలు తలాడించినా, ఘటనా స్థలానికి చేరుకున్నాక, ప్రాణాలు తీసుకొనే విషయంలో తటపటాయించినట్లు చెబుతున్నారు. ఇంతలో త్రిభువన్ విజయవాడ వైపునకు వెళుతున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యాయత్నం చేయగా, అక్కడికక్కడే మరణించాడు.
అనంతరం సత్యప్రభ, అమృతలు కూడా తిరుమల ఎక్స్‌ప్రెస్ కిందపడి బలవన్మరణానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సత్యప్రభ మృతిచెందగా.. అమృతకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబంలో మిగిలిన బిడ్డ ప్రాణం దక్కించుకొనేందుకు ఆ తండ్రి పోరాటం చేస్తున్నారు. శ్రీదేవి సత్యప్రభ, త్రిభువన్ మృతదేహాలకు ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం పోస్టుమార్టం పూర్తయ్యింది.
విజయవాడ ఆసుపత్రిలో అమృత
రైలు ఘటనలో తీవ్రగాయాలపాలైన అమృతను గూడెంలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోస ం విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అమృతకు మెదడు సంబంధిత శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్సై హరిబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment