నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

May 9 2018 12:29 AM | Updated on May 9 2018 12:29 AM

love doctor solve the problems - Sakshi

హలో సార్‌..! నేనొక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నా. మొదట్లో తను.. నాతో చాలా ప్రేమగా ఉండేది. కానీ ఇప్పుడు నా మీద తనకి ప్రేమ తగ్గిపోయింది. తను నన్ను అవాయిడ్‌ చేస్తుంటే నా ప్రాణం పోయినట్లుగా అనిపిస్తోంది. చచ్చేవరకూ ప్రాణంగా చూసుకుంటానని చెప్పాను. అయినా తను నా ప్రేమకు కరగటం లేదు. తనకి ప్రెస్టేజ్‌ కావాలట. దాని కోసం నేను ఏం చెయ్యాలి? నాకు చావు తప్ప ఏం కనబడటం లేదు. నిద్రలేని రాత్రులే మిగిలేలా ఉన్నాయి. చాలా భయంగా ఉంది సార్‌. ఆమెకి తిరిగి నాపై ప్రేమ కలగాలంటే ఏం చెయ్యాలో మీరే చెప్పండి ప్లీజ్‌. – బాలకృష్ణ
డెత్‌.. ఈజ్‌ ఎ వేస్ట్‌!టైమ్‌ వచ్చినప్పుడు దేవుడే తీసుకెళ్లిపోతాడు.నీకు లైఫ్‌ అంటే జోక్‌ అయిపోయింది.ఒకసారి దగ్గరలో ఉన్న ఓ క్యాన్సర్‌ హాస్పిటల్‌కి వెళ్లి చూడు.అక్కడ.. చిన్న చిన్న పిల్లలు ప్రాణం కోసం పోరాడుతున్నారు.వాళ్లు ఏం తప్పు చేశారని వాళ్లకా శిక్ష?వాళ్ల ప్రేమ గొప్పది కాదా?వాళ్లను ప్రేమిస్తున్న అమ్మానాన్నలది గొప్ప ప్రేమ కాదా?ఊరికే పిచ్చిగా మాట్లాడకు అన్నయ్యా...!!దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు.పేరెంట్స్‌ నీకు మంచి అవకాశాలను ఇస్తున్నారు.చేతనైతే నలుగురికి సాయం చెయ్యి.అంత సెల్ఫిష్‌గా ఉండొద్దు.‘మరి అమ్మాయి ప్రేమ ఏంటి సార్‌?’ఒక్కోసారి ప్రేమ.. ప్రేమ కాదనిపిస్తుంది. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రేమించలేనన్న అమ్మాయిని ఎమోషనల్‌గా ప్రెజర్‌ పెట్టి ప్రేమించమంటే ఎలా నీలూ? ఒక్కోసారి మనకు కావల్సినవి దక్కవు. దమ్ముంటే నిన్ను నువ్వు నమ్ముకో.. నీ ప్రేమను నమ్ముకో.. మంచి మనసు ఉంటే.. నీ ప్రేమను ఆ అమ్మాయి నుంచి మళ్లించి నీ కుటుంబానికి.. నీ స్నేహితులకు.. నీ చుట్టూ ఉన్న వాళ్లకు పంచు. అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది బాలయ్యా! టేక్‌ మై వర్డ్‌!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement