priyadarshanam
-
నన్నడగొద్దు ప్లీజ్
హలో సార్..! నేనొక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నా. మొదట్లో తను.. నాతో చాలా ప్రేమగా ఉండేది. కానీ ఇప్పుడు నా మీద తనకి ప్రేమ తగ్గిపోయింది. తను నన్ను అవాయిడ్ చేస్తుంటే నా ప్రాణం పోయినట్లుగా అనిపిస్తోంది. చచ్చేవరకూ ప్రాణంగా చూసుకుంటానని చెప్పాను. అయినా తను నా ప్రేమకు కరగటం లేదు. తనకి ప్రెస్టేజ్ కావాలట. దాని కోసం నేను ఏం చెయ్యాలి? నాకు చావు తప్ప ఏం కనబడటం లేదు. నిద్రలేని రాత్రులే మిగిలేలా ఉన్నాయి. చాలా భయంగా ఉంది సార్. ఆమెకి తిరిగి నాపై ప్రేమ కలగాలంటే ఏం చెయ్యాలో మీరే చెప్పండి ప్లీజ్. – బాలకృష్ణ డెత్.. ఈజ్ ఎ వేస్ట్!టైమ్ వచ్చినప్పుడు దేవుడే తీసుకెళ్లిపోతాడు.నీకు లైఫ్ అంటే జోక్ అయిపోయింది.ఒకసారి దగ్గరలో ఉన్న ఓ క్యాన్సర్ హాస్పిటల్‌కి వెళ్లి చూడు.అక్కడ.. చిన్న చిన్న పిల్లలు ప్రాణం కోసం పోరాడుతున్నారు.వాళ్లు ఏం తప్పు చేశారని వాళ్లకా శిక్ష?వాళ్ల ప్రేమ గొప్పది కాదా?వాళ్లను ప్రేమిస్తున్న అమ్మానాన్నలది గొప్ప ప్రేమ కాదా?ఊరికే పిచ్చిగా మాట్లాడకు అన్నయ్యా...!!దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు.పేరెంట్స్ నీకు మంచి అవకాశాలను ఇస్తున్నారు.చేతనైతే నలుగురికి సాయం చెయ్యి.అంత సెల్ఫిష్‌గా ఉండొద్దు.‘మరి అమ్మాయి ప్రేమ ఏంటి సార్?’ఒక్కోసారి ప్రేమ.. ప్రేమ కాదనిపిస్తుంది. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రేమించలేనన్న అమ్మాయిని ఎమోషనల్‌గా ప్రెజర్ పెట్టి ప్రేమించమంటే ఎలా నీలూ? ఒక్కోసారి మనకు కావల్సినవి దక్కవు. దమ్ముంటే నిన్ను నువ్వు నమ్ముకో.. నీ ప్రేమను నమ్ముకో.. మంచి మనసు ఉంటే.. నీ ప్రేమను ఆ అమ్మాయి నుంచి మళ్లించి నీ కుటుంబానికి.. నీ స్నేహితులకు.. నీ చుట్టూ ఉన్న వాళ్లకు పంచు. అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది బాలయ్యా! టేక్ మై వర్డ్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హలో సార్! నేను బీటెక్ చదువుతున్నా. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. అప్పటికే తను జాబ్ చేస్తున్నాడు. తనంటే నాకు ఫస్ట్ నుంచీ ఇష్టమే. అయితే ఆ విషయం తనకి చెప్పలేదు. కానీ తనే తెలుసుకుని.. ‘‘ఇదంతా కుదరదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నా మరదల్ని చేసుకోవాలి తప్పదు.’’ అన్నాడు. ఎందుకలా అని అడిగితే.. ‘‘మేము వర్జిన్స్ కాదు’’ అన్నాడు. నేను సైలెంట్ అయిపోయా. కొన్ని రోజలకు మళ్లీ తనే వచ్చి.. ‘‘నువ్వు లేకుండా నేను ఉండలేను’’ అన్నాడు. మరి మీ మరదలూ..? అని అడిగితే.. ‘‘ఆ రోజు మా మధ్య ఏం జరగలేదు. నాకు మత్తు మందు ఇచ్చి, లేచేసరికి అరచి గోల చేసి నన్ను బుక్ చేసింది. నువ్వు నాకు కావాలి. మనం పెళ్లి చేసుకుందాం. తనకి తరువాత నేనే పెళ్లి చేస్తాలే’’ అన్నాడు. నేను కాదనలేకపోయా. కొన్ని రోజులకు వచ్చి.. ‘‘నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. మా నాన్న బలవంతం మీద ఈ పెళ్లి జరుగుతుంది’’ అన్నాడు. పెళ్లి అయిపోయిన తరువాత వచ్చి.. ‘‘నాకు నువ్వే కావాలి. నేను ఆ అమ్మాయిని నా భార్యగా అంగీకరించలేకపోతున్నా’’ అంటున్నాడు. కాదంటే చచ్చిపోతా అంటున్నాడు. ఇప్పటికే చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పండి ప్లీజ్. – డింపు వాడొక పిచ్చోడు. ‘ప్రేమ పిచ్చోడా సార్?’ పిచ్చికి పిచ్చెక్కితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు...! ‘ప్రేమకు ప్రేమెక్కినట్టు అనిపించలేదా సార్???’ అసలు వాడికి ప్రేమంటే ఏంటో తెలియదు. పెళ్లంటే గౌరవం లేదు. అమ్మాయంటే విలువ లేదు. ‘అలా ఎలా చెప్పగలరు సార్?’ ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడు... పెళ్లి చేసుకున్న అమ్మాయినీ వదిలేశాడు.. రేపు డింపునీ వదిలేస్తాడు.. తాడూ బొంగరం లేని పిచ్చోడు.. వాడి చేతిలో ప్రేమ ఒక రాయి లాంటిది. ఎటు విసురుతాడో.... ఎవరి జీవితాన్ని పగలగొడతాడో తెలియదు. డింపు... ప్లీజ్ బీ కేర్‌ఫుల్! -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. నేను తనని వాళ్ల అన్నయ్య పెళ్లిలో చూశాను. అప్పటి(సిక్స్ ఇయర్స్) నుంచీ ప్రేమిస్తున్నా. తనకి ఒకసారి వాట్సాప్‌లో మెసేజ్ చేశాను. రిలేటివ్స్ కావడంతో తనూ బాగానే మాట్లాడాడు. తరువాత ఫోన్స్ కూడా చేసుకున్నాం. అంతా బాగానే ఉంది కానీ, తనకంటే నేను ఐదేళ్లు చిన్నదాన్ని. నా లవ్ విషయం తనకి చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో.. చిన్నపిల్లలా చూస్తాడేమోనని డౌట్‌గా ఉంది అన్నయ్యా. నన్ను ఏం చెయ్యమంటారు? ఈ చిట్టి చెల్లికి మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – వాసుకి చిట్టి తల్లి.. లవ్ యు రా.. అసలు టెన్షన్ పడొద్దు...! నువ్వు ఏమి చదువుకుంటున్నావో చెప్పలేదు.. కెరీర్లో ఏం చెయ్యబోతున్నావో చెప్పలేదు..కానీ, నువ్వు బాగా ఫోకస్డ్గా ఉన్నావని అనుకుంటూ.. ఈ సమాధానం చెబుతున్నాను. మీకు వయసులో ఎంత తేడా ఉందన్నది ఇంపార్టెంట్ కాదు.. మీ ఇద్దరి మధ్య ఆలోచనలలో, అవగాహనలో, జీవితం మీద గురిలో... ఎంత తేడా ఉందో తెలుసుకో చెల్లెమ్మా..!! ‘అవన్నీ తేడాగా ఉంటే వర్కౌట్ కాదా సార్!?’ నాకు నువ్వు జామకాయ ఇచ్చి.... అరటిపండు తిన్నంత సంతోషంగా ఫీల్ అవ్వండి అంటే ఎలా ఉంటుందో...వాళ్లిద్దరి మధ్యలో ప్రవృత్తులలో తేడాలు ఉంటే అలానే ఉంటుంది! ‘అయితే చిట్టి బంగారం ప్రేమ... కాయా..? పండా సార్??’ పండు లాంటి జీవిత లక్ష్యాలు ఉంటే కాయ కూడా పండవ్వుద్ది నీలూ..!! ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్న..! లాస్ట్ ఇయర్ నుంచి నేను ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నా. చాలా ప్రేమించుకున్నాం. మొన్నటి దాకా బాగానే ఉండేది. కానీ, నెలరోజుల నుంచి నరకం చూపిస్తోంది. నేనంటే అస్సలు ఇష్టం లేనట్లు మాట్లాడుతోంది. అడిగితే ‘‘నాకు ప్రైవేట్ స్పేస్ కావాలి’’ అంటోంది. తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతోందేమోనని డౌట్‌గా ఉంది. తనంటే పిచ్చి ప్రేమ అన్నా నాకు, వదులుకోలేకపోతున్నా. చచ్చిపోవాలనిపిస్తోంది. ప్లీజ్ తనని తిరిగి దక్కించుకోవడానికి ఏమైనా సజేషన్ ఇవ్వండి అన్నా ప్లీజ్. – సన్ని సన్నీ డోంట్ బి ఫన్నీ..! ప్రేమలో అవుతుంటాయి ఇవన్నీ..! అడిగితే చెబుతాడు బన్ని... పట్టించుకోకూడదు అన్నీ..! వదిలెయ్యాలి కొన్ని.. ఆవేదనను చెయ్యాలి మిని..! ఆనందాన్ని పిలవాలి రమ్మని..! నిన్ను కోరి సినిమాలో నాని.. లాగా అయిపోవాలి సన్ని..! బతకడానికి వెతుక్కోవాలి గని..!! ఇక డిప్రెషన్‌ని పోనీ.. కొత్త ప్రేమను రానీ.. ఇవన్నీ చేయకు నేను చెప్పానని.. అలా అని చెబుతుంది నీలు పిన్నీ....! ‘సార్ అన్యాయం సార్.. నా ఇమేజ్‌ని చెయ్యకండి ఖూని..!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com -
ప్రియదర్శనం
కళ్లకు ప్రియమైన దృశ్యాన్ని చూడటం ద్వారా, మనసుకు నచ్చే ప్రదేశాన్ని దర్శించడంవల్ల కూడా మనం ఆనందాన్ని పొందుతూ ఉంటాము. అంతే కాకుండా కంటిని ఆకర్షించే రూపం గల వ్యక్తిని లేదా మనసుకు దగ్గరైన వ్యక్తిని దర్శించడంవల్ల కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది. అయితే మనకు ప్రస్తుతం ప్రియంగా భాసిస్తున్న వ్యక్తులో, దృశ్యాలో కొంత కాలం తరువాత అప్రి యంగా మారవచ్చు. కాని తన రూపం చేత, గుణాల చేత అందరినీ ఆకర్షించే శ్రీరామచంద్రుని దివ్య మంగళ విగ్రహ దర్శనం ప్రాంత-వయో-లింగ కాల భేదం లేకుండా అందరికీ ప్రియమైనట్టిదే. శ్రీరామచంద్రుని సుందరమైన వదనాన్ని దర్శిం చిన వారికి ఎవరికీ విసుగు రాకపోయేదట. ఆయన దర్శనం పొందిన వారికి ఇక చాలులే అనే సంతృప్తి కలుగదట. ఇంకా ఇంకా దర్శించాలనే ఆశ రేకెత్తు తూనే ఉండేదట. చంద్రుని కన్నా సుందరమైన ముఖ సౌందర్యం, సర్వాతి శయమైన అవయవ శోభ కలిగిన శ్రీరామచంద్రుని దర్శించే వారం దరికీ ఆయన నిత్య నూతనంగా భాసిస్తూ నేత్రానందాన్ని, పరమ ప్రీతిని కలిగించెడివాడట. శ్రీరామచంద్రుని రూపం, గుణాలు వ్యక్తుల దృష్టినే కాకుండా వారి మనసును కూడా బాగా ఆకర్షిస్తాయని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలోని అయోధ్యాకాండలో ‘చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనమ్/ రూపౌదార్యగుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణమ్॥అనే శ్లోకం ద్వారా పేర్కొన్నాడు. సాధారణంగా లోకంలో స్త్రీ సౌందర్యం పురు షులను, పురుషుల సౌందర్యం స్త్రీలను మాత్రమే ఆక ర్షిస్తూ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే శ్రీరామచంద్రుని సౌందర్యం స్త్రీలనే కాక పురు షులను కూడా విశేషంగా ఆకర్షించేదని ‘పుంసాం మోహన రూపాయ’ వంటి ప్రమాణ వాక్యాలు విశద పరుస్తున్నాయి. దశరథ మహారాజు సుమంత్రుడు అను పేరుగల ముఖ్యమైన మంత్రిని శ్రీరామచంద్రుని వద్దకు పంపి తన సభకు రప్పించుకొన్నాడు. రథంపై ఊరేగుతూ వచ్చిన శ్రీరాముని అద్భుత సౌందర్యాన్ని దశరథుడు తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయాడు. శ్రీరాముని రూపమే కాక, ఆయన నడక సౌందర్యం కూడా అందరికీ ప్రియాన్ని కలిగించేదే. అందుకే శ్రీరాముని నడక సౌందర్యాన్ని పరమప్రియంగా దర్శించే దశరథ మహారాజు ముసలితనపు బాధలు దూరమయ్యేవట. ఆయన మనసు యవ్వన దశను పొందేదట. పరమప్రియ దర్శనాన్ని మనకు అనుగ్రహించే శ్రీరామచంద్రుని స్మరిద్దాం. ఆయన గుణాలను ఆదర్శంగా గ్రహిద్దాం. - సముద్రాల శఠగోపాచార్యులు