నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Mon, Jan 15 2018 2:02 AM | Last Updated on Mon, Jan 15 2018 2:02 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. నేను తనని వాళ్ల అన్నయ్య పెళ్లిలో చూశాను. అప్పటి(సిక్స్‌ ఇయర్స్‌) నుంచీ ప్రేమిస్తున్నా. తనకి ఒకసారి వాట్సాప్‌లో మెసేజ్‌ చేశాను. రిలేటివ్స్‌ కావడంతో తనూ బాగానే మాట్లాడాడు. తరువాత ఫోన్స్‌ కూడా చేసుకున్నాం. అంతా బాగానే ఉంది కానీ, తనకంటే నేను ఐదేళ్లు చిన్నదాన్ని. నా లవ్‌ విషయం తనకి చెబితే ఎలా రియాక్ట్‌ అవుతాడో.. చిన్నపిల్లలా చూస్తాడేమోనని డౌట్‌గా ఉంది అన్నయ్యా. నన్ను ఏం చెయ్యమంటారు? ఈ చిట్టి చెల్లికి మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌.
– వాసుకి

చిట్టి తల్లి.. లవ్‌ యు రా.. అసలు టెన్షన్‌ పడొద్దు...! నువ్వు ఏమి చదువుకుంటున్నావో చెప్పలేదు.. కెరీర్‌లో ఏం చెయ్యబోతున్నావో చెప్పలేదు..కానీ, నువ్వు బాగా ఫోకస్డ్‌గా ఉన్నావని అనుకుంటూ.. ఈ సమాధానం చెబుతున్నాను. మీకు వయసులో ఎంత తేడా ఉందన్నది ఇంపార్టెంట్‌ కాదు.. మీ ఇద్దరి మధ్య ఆలోచనలలో, అవగాహనలో, జీవితం మీద గురిలో... ఎంత తేడా ఉందో తెలుసుకో చెల్లెమ్మా..!! ‘అవన్నీ తేడాగా ఉంటే వర్కౌట్‌ కాదా సార్‌!?’ నాకు నువ్వు జామకాయ ఇచ్చి.... అరటిపండు తిన్నంత సంతోషంగా ఫీల్‌ అవ్వండి అంటే ఎలా ఉంటుందో...వాళ్లిద్దరి మధ్యలో ప్రవృత్తులలో తేడాలు ఉంటే అలానే ఉంటుంది! ‘అయితే చిట్టి బంగారం ప్రేమ... కాయా..? పండా సార్‌??’ పండు లాంటి జీవిత లక్ష్యాలు ఉంటే కాయ కూడా పండవ్వుద్ది నీలూ..!!

ప్రియదర్శిని రామ్‌
లవ్‌ డాక్టర్‌ 

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, 
బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement