ఎన్.రాహుల్ (ఫైల్)
చాంద్రాయణగుట్ట: ప్రేమ విఫలమై మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై అరవింద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.గౌలిపురా మేకలమండి ప్రాంతానికి చెందిన మాధవ రావు కుమారుడు రాçహుల్(25) వెల్డర్‌గా పని చేసేవాడు. ప్రేమ విఫలం కావడంతో ఆరు నెలల క్రితం అతను రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు నచ్చజెప్పి తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్న రాహుల్ సీలింగ్‌కు ఉన్న హుక్కుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment