
సాయికిరణ్ (ఫైల్)
అల్వాల్: ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి లోనైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ మట్టయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన రాజ్యం సుజాత కుమారుడు సాయికిరణ్(27) బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
నాలుగేళ్లుగా అతను ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు నెలల క్రితం సదరు యువతితో మనస్పర్థలు నెలకొన్నాయి. దీంతో మనస్తాపానికిలోనైన సాయికిరణ్ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి రాజ్యం సుజాత ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.