Love Failure Gym Trainer Selfie Suicide At Karnataka - Sakshi
Sakshi News home page

జిమ్‌ ట్రైనర్‌ ప్రేమ విఫలం.. పెళ్లి చూపులకు వెళ్లాల్సి ఉండగా..

Published Mon, Oct 25 2021 2:33 PM | Last Updated on Mon, Oct 25 2021 4:06 PM

Love Failure Gym Trainer Selfie Suicide At Karnataka - Sakshi

కార్తీక్‌ (29) జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను గత మూడేళ్లు నుంచి ఓ యువతి ని ప్రేమిస్తున్నాడు.  కానీ ఇటీవల..

బనశంకరి: ప్రేమ ఫలించలేదని జిమ్‌ శిక్షకుడు వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజరాజేశ్వరినగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  చోటుచేసుకుంది. మారప్పలేఔట్‌ కు చెందిన కార్తీక్‌ (29) అనే యువకుడు జిమ్‌ ట్రైనర్‌గా ఉంటున్నాడు. ఇతను గత మూడేళ్లు నుంచి ఓ యువతి ని ప్రేమిస్తున్నాడు.  కానీ ఇటీవల యువతి దూరం కావడంతో  కార్తీక్‌ కుంగిపోయినట్లు తెలిసింది.

ఈ తరుణంలో అతనికి తల్లిదండ్రులు ఒక సంబంధం చూశారు. ఆదివారం పెళ్లిచూపులకు వెళ్లాల్సి ఉంది. కానీ శనివారం రాత్రి ఇంట్లో తన ప్రేమ వైఫల్యం గురించి సెల్ఫీ వీడియో తీసుకుని షీట్‌ హ్యాంగర్‌ కు ఉరివేసుకున్నాడు. స్థానిక పోలీసులు కార్తీక్‌ మొబైల్‌ను స్వా«దీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపడుతున్నారు.
(చదవండి: రిక్షా కార్మికుడిని రూ.3 కోట్లు టాక్స్‌ కట్టాలన్న ఐటీ అధికారులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement